అక్టోబరు 1న రాయలసీమకు కేసిఆర్ పరిటాల శ్రీరాం పెళ్లికి హాజరు ప్రత్యేక విమానంలో పుట్టపర్తికి హెలిక్యాప్టర్ లో వెంటాపురం గ్రామానికి వివాహంలో 15 నిమిషాలు గడిపి తిరుగు ప్రయాణం
తెలంగాణ సిఎం కేసిఆర్ రాయలసీమలో మరోమారు అడుగుపెట్టనున్నారు. గతంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శించుకున్నారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
తాజాగా మరోసారి రాయలసీమకు వెళ్లేందుకు కేసిఆర్ పర్యటన ఖరారైంది. అక్టోబరు 1వ తేదీన ఎపి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటా సునీత కొడుకు పరిటాల శ్రీరామ్ వివాహం జరగనుంది. ఈ వివాహానికి సిఎం కేసిఆర్ హాజరు కానున్నారు.
కేసిఆర్ పర్యటనపై అనంతపురం జిల్లా అధికారులకు కేసిఆర్ పర్యటన తాలూకు షెడ్యూల్ వివరాలు గురువారం రాత్రి అందినట్లు తెలిసింది.
శ్రీరాం పెళ్లి పరిటాల సొంత గ్రామమైన అనంతపురం జిల్లాలోని రామగిరి మండలం వెంకటాపురంలో జరగనుంది. దీనికి సిఎం కేసిఆర్ ఆరోజు ఉదయం 11.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. 12.15 వరకు అక్కడ దిగుతారు. అనంతరం 12.20 కి హెలిక్యాప్టర్ లో బయలుదేరి 12.40కి వెంకటాపురం చేరుకుంటారు. పెళ్లి వేడుకల్లో 15 నిమిషాలు పాటు పాల్గొంటారు.
అనంతరం వెంటనే 12.55 గంటలకు హెలిక్యాప్టర్ లో బయలదేరి 1.20 గంటలకు పుట్టపర్తి చేరుకంటారు. అక్కడి నుంచి విమానంలో మధ్యాహ్నం 2.10 గంటల వరకు హైదరాబాద్ చేరుకుంటారు.
కొంతదూరం ప్రత్యేక విమానంలో, మరికొంత దూరం హెలిక్యాప్టర్ లో ప్రయాణించి కేవలం మూడు గంటట్లోనే కేసిఆర్ అనంపురంలో జరగనున్న పరిటాల శ్రీరాం వివాహానికి హాజరై తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ నుంచి వెళ్లనున్న కేసిఆర్ తిరిగి మధ్యాహ్నం 2.10 గంటలకే తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.
