కేసిఆర్ చెప్పిన పూతరేకుల కథ

కేసిఆర్ చెప్పిన పూతరేకుల కథ

తెలంగాణ సిఎం కేసిఆర్ ఆసక్తికరమైన కథ చెప్పారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన ప్రసంగంలో అనేక విషయాలు చెప్పారు. తన చిన్ననాటి ముచ్చట్లను పంచుకున్నారు. తన గురువుకు వేదిక మీదే కేసిఆర్ పాదాభివందనం చేశారు.

ఈ సందర్భంగా తాను చిన్నతనంలో చదువుకునే రోజులను గుర్తు చేస్తూ పూతరేకుల ముచ్చట చెప్పారు. రాయిలా ఉండే తనను గురువులే ఇలా మార్చారని చెప్పారు. తాను చిన్నతనంలో సినిమా పాటల పుస్తకాలు చదివేవాడినని గుర్తు చేసుకున్నారు. శోభన్ బాబు సినిమాలో పాటలో పూతరేకులా లేత సొగసు అనే పదం ఉందట. వెంటనే పూతరేకులు అంటే ఏమిటో తెలుసుకునేందుకు ఆ రోజుల్లో చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పారు. ఈ పూతరేకులు అనే పదాన్ని తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా దొరకలేదన్నారు. దీంతో తన గురువును అడిగితే ఆయన కూడా తెలియదని సమాధానం చెప్పారని గుర్తు చేశారు. అయితే తన గురువు పూతరేకులు అంటే ఏమిటని విజయవాడలో ఉన్న తన స్నేహితుడికి లేఖ రాస్తే.. ఆ విజయవాడ స్నేహితుడు వివరణ ఇచ్చారని తెలిపారు. అయితే ఆ సమయంలో తన గురువు కూడా తనను అభినందించారని కేసిఆర్ వివరించారు. పూతరేకులు అనే మాటను నీవల్ల తెలుసుకున్నానంటూ కేసిఆర్ ను ప్రశంసించారని గుర్తు చేశారు.

తెలుగు భాష గొప్పతనాన్ని తనదైన శైలిలో వివరించి కేసిఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.   

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos