Asianet News TeluguAsianet News Telugu

కోదండరాం పై కసి తీర్చుకున్న కేసిఆర్

  • కోదండరాం అనేవాడు టిఆర్ఎస్ పట్ల విషపూరితమైన వ్యక్తి
  • వాడు చేసింది అమరుల యాత్రనా? లంగా యాత్రనా?
  • జీవితంలో సర్పంచ్ గా గెలిచిండా?
  • నేను తయారు చేసిన లక్షల మందిలో వాడొకడు
  • టిఆర్ఎస్ అధికారంలోకి రావడం వీడికి ఇష్టం లేకుండే
  • ఉద్యమంలో వీడు చేసిందేమీ లేదు తొక్క
kcr spits venom on kodandaram and states he is a big zero in Telangana

తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాం పై సిఎం కేసిఆర్ కసి తీర్చుకున్నారు. తీవ్రమైన పదజాలంతో ధూషణలకు దిగారు కేసిఆర్. వాడు  అంటూ ఘాటుగా తిట్ల దందకం అందుకున్నారు. ఈ కోదండరాం ఎవడు అంటూ తీవ్రమైన కోపంతో మాట్లాడారు. ఇంకా కోదండరాం గురించి ఏమన్నారంటే... కేసిఆర్ మాటల్లోనే.

కోదండరామ్ తన గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నడు.

ఆయన చేసిన యాత్రలో ఒక్కదగ్గర అన్నా 500 మంది వచ్చిర్రా?

సింగరేణి ఎన్నికల్లో ఏం మాట్లాడతాడు కోదండరాం? టిబిజికెఎస్ గెలిస్తే సింగరేణి నాశనమైతదా?

నీ సక్కదానికి జీవితంలో సర్పంచ్ గా గెలిచినవా? కోదండరాం పిలుపునిచ్చిండట? ఆయన ఎవరు పిలుపినవ్వడానికి ఆయనేమైనా సిఎం హా?

ఆయనేదో జాతీయ నాయకుడైనట్లు పిలుపిస్తడా? ఇదంతా గ్యాస్. ఉట్టిదే.

తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు కోదండరాం. వాడేదో గొప్ప అనుకుంటున్నడు.

ఆయనకు జెఎసి ఎక్కడున్నది. అసలు జెఎసి పేరు పెట్టిందే నేను. ఫార్ములా రూపొందించిందే నేను.

 ఆనాడు కేంద్రం ప్రకటనను వెకకకు తీసుకుంటుంటే నేను శష బిషలు లేకుండా జానారెడ్డి ఇంటికి పోయిన. అప్పుడు జయశంకర్ సార్ ను అడిగితే కోదండరాం ను పెట్టమన్నడు. సాగరహారం ఒక్కటే కాదు అన్ని కార్యక్రమాలు వందకు వంద శాతం ప్రతి కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీనే చేసింది.

త్యాగాలు చేసింది టిఆర్ఎస్ మాత్రమే. ఏదో బండి కింద కుక్క పోతున్నప్పడు నేనే మోస్తున్న అనుకుంటది కుక్క. ఆ తీర్గా ఉంది కోదండరాం పని. 2001లో నేను మొదలు పెట్టిన నాడు ఎక్కడున్నరు వీళ్లంతా?

కోదండరాం అనే వాడు... టిఆర్ఎస్ యెడల విషపూరితమైన వ్యక్తి.

ఉద్యమం అప్పడే రహస్య యాత్రలు చేసి దిగ్విజయ్ ను, సోనియాగాంధీని కలిసిండు.

టిఆర్ఎస్ అధికారంలోకి రావడం వీడికి ఇష్టం లేకుండే.

నేను తయారు చేసిన లక్షల మంది నాయకుల్లో వీడొకడు.

వీడు చేసిందేమీ లేదు తొక్క.

నా మెదడు, నా రక్తాన్ని పెట్టి 14 ఏళ్లు పనిచేసిన. తెలంగాణ తెచ్చిన.

జెఎసి ఛైర్మన్ పేరు ఎట్ల పెట్టుకుంటువు. నీకు ఎట్ల అర్హత ఉంది. ఇదేం నైతికత.

నీకు జెఎసి ముసుగెందుకు? నీ జెఎసిలో ఎవలున్నరు. ఎవడన్నా ఉన్నడా?

ఆనాడు జెఎసిలో అన్ని పార్టీలు ఉన్నాయి.

దిక్కుమాలినోళ్లను పెట్టుకుని సంఘం పెట్టి ఏదో అయిత అనుకుంటే ఐతదా?

లక్షా 12వేల మందికి ఉద్యోగాలు ఇవ్వబోతున్నం అని నేను ఎప్పుడో చెప్పిన.

అయినా ఇంకా కొలువుల కొట్లాల ఏందండీ నాకర్థం కాదు.

ఇన్ని రోజులు సహించిన. పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నా కూడా.

అమరుల స్పూర్తి యాత్ర అని పెట్టిండు కోదండరాం.

మొట్ట మొదటి అమరుడు శ్రీకాంతచారి తల్లిని పరామర్శించినవా?

అమరుల స్పూర్తి యాత్రనా? లంగా రాజకీయ యాత్రనా? నువ్వు చేసేది?

అంతగా ఆసక్తి ఉంటే రారా బాబూ అని చెప్పిన. ఎంపి కావాలా? ఎమ్మెల్యే కావాలా ఇస్తా అన్న.

ఎంతసేపు కేసిఆర్ మీద విషం కక్కుడేనా?

కేసిఆర్ తెలంగాణ తెచ్చింది నిజం కాదా?

అబద్ధమా? దాన్ని ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నవు.

ఇలాంటి వాళ్లు చాలా మంది వస్తారు. పట్టించుకుని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు అని తెలంగాణ ప్రజలకు చెబుతున్న నేను.

నిరుద్యోగ సోదరులకు నేను ఒక్కటే మనవి చేస్తున్న.

 గవర్నమెంటు కన్వినెంట్ ప్రకారం ఉద్యోగాలు ఇస్తది.

డిఎస్సీ పెట్టాలి అర్జంట్ గ అంటున్నరు. ఎట్ల పెడతరు. అంత తొందరేముంది.

డిఎస్సీ ఆలస్యమైతే ప్రపంచం మునిగిపోతదా? ఏమైతది?

దానికేం తొందర ఉంది. దాన్ని పరిశీలిస్తున్నం. గింతదానికే ముఖ్యమంత్రి మీద అసత్య ప్రచారం చేసుడు ఎక్కడన్నా ఉందా?

ఎక్కడ పోతే అక్కడ గెలిచిన నేను. ఒక్కచోట చేయలే.

30 ఏళ్లు రాజకీయాల్లో ఉన్న. ఇవన్నీ మీకు జీర్ణం కావు.

అతని కెపాసిటీ ఏంటో నాకు తెలుసు. చాలా చిన్నవాడు.

ఆయనేమీ అమాయకుడు కాదు. కాంగ్రెస్ తో రహస్యంగా కలిశాడు.

ఈన మాటలు నమ్మే కాంగ్రెస్ నాశనమైపోయింది. లేకపోతే మాతో పొత్తు పెట్టుకుని బానే ఉండేది.

కత్తి వెంకటస్వామికి టికెట్ ఇప్పించింది ఈనే. 

అద్దంకి దయాకర్ కు టికెట్ ఇప్పించింది కూడా ఈనే.

ఈన సాధించిన ఘనకార్యమేంది తొక్క.

పార్టీ పెట్టుడంటే పాన్ డబ్బా పెట్టుడానయా?

చిరంజీవిని చూడలేదా మనం. కట్టెల మోపు ఎత్తేసినట్లు ఎత్తేసిండు.

పార్టీ పెట్టుడంటే చాలా సాహసం కావాలి.

ఆయన యాత్ర బండికి ఎవని పాలైందిరో తెలంగాణ అన్న పాట పెట్టుకుండు. 

అందుకే నాకు కోపమొచ్చింది. ఎవని పాలైంది తెలంగాణ? తెచ్చినోడే ఏలుతుండు తెలంగాణను.

నీకెందుకు జీర్ణమైతలేదు. 

ఇలా పరుషమైన పదజాలంతో కోదండరాంపై సిఎం కేసిఆర్ విరుచుకుపడ్డారు.

 

మరిన్ని వార్తలు ఇక్కడ

https://goo.gl/yhm1Ku

లండన్ లో వరంగల్ స్వాతి మృతి మీద అనుమానాలు

Follow Us:
Download App:
  • android
  • ios