కేసిఆర్ ప్లీనరీ దెబ్బ అదుర్స్ కదూ...

kcr speach in trs plenary : full text
Highlights

రాహుల్, మోడీని కడిగిపారేసిన కేసిఆర్

టిఆర్ఎస్ ప్లీనరీలో సిఎం కేసిఆర్ ప్రసంగం కొత్త చర్చను లేవనెత్తింది. దేశ రాజకీయాలతోపాటు తెలంగాణ రాజకీయాలను కేసిఆర్ తన ప్రసంగంలో చేర్చారు. ప్లీనరీ వేదిక మీద కేసిఆర్ ప్రసంగం పూర్తి పాఠం కింద ఉంది చదవండి.

ప్లీనరీకీ వచ్చిన ప్రతి ఒక్కరికి నా స్వాగతం. రాష్ట్రం నుంచి కాకుండా వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్వక స్వాగతం. 2001లో పార్టీ స్థాపించనప్పుడు ఎన్నో అనుమానాలు.. అవమానాలు భరించాం. ఇది అయ్యే పనేనా అని చాలా మంది అనుకున్నారు..అందరి అంచనాలను పటాపంచలు చేస్తూ....తెలంగాణను సాధించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకీ వెళుతున్నా..తిరిగి తెలంగాణ రాష్ట్రంలోనే అడుగుపెడుతున్నానని చెప్పాను..అన్నది అన్నట్టుగానే తెలంగాణలోనే అడుగుపెట్టా. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా కొందరు శాపనార్థాలు పెట్టినా...కొందరు దీవించారు. ధైర్యంతోని తెలంగాణ ప్రజలకు మనకు ఉన్నట్టి నమ్మకంతోని ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగాను..ఎన్నికల్లో తెలంగాణ ప్రజానికం మనకు అద్భుతమైన విజయాన్ని అందించారు. మన బతుకులు మార్చేది ఒక టీఆర్ఎస్ అనీ ప్రజలు మనకు పట్టం కట్టారు. దేశంలోనే అవినీతి లేకుండా నీతిగా నిజాయితీగా నడిపిస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పడానికి గర్వంగా ఉంది. విద్యుత్ ఒప్పందాలను ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించినప్పుడు దేశంలోని వివిధ పార్టీలు మనన్ని మెచ్చుకున్నాయి. ఎలాంటి లబ్ది ఆశించకుండా ప్రజలకు పారదర్శకంగా పాలనను అందిస్తున్నందుకు మనల్ని అభినందిచారు. సంక్షేమ పథకాలు దేశంలోని ఎక్కడా లేనివిధంగా ఇక్కడ అమలువుతున్నాయి. ఇది అందరికి తెలిసినా విషయమే. ప్రతి ఇంటికి లబ్దిచేకూరేలా మన సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఏరకమైన సహాయమైనా పారదర్శకంగా ఉండే కార్యక్రమాలు చేపట్టాం. కొన్ని పనులు చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజన తండాలను ఏర్పాటు చేసి ...తండాలను గ్రామపంచాయితీలుగా మార్చిన ఘనత కూడా టీఆర్ఎస్ దే. గతంలో అనేక పార్టీలకు గిరిజనులకు హామీలు ఇచ్చాయి కానీ అమలు చేయలేదు. కానీ టీఆర్ఎస్ మాత్రం అమలు చేసింది.

ఇక జిల్లాల ఏర్పాటుతో పాలనను వికేంద్రీకరించుకోగలిగాం.పరిపాలన సంస్కరణలో భాగంగా పది జిల్లాలను 31 జిల్లాలను చేసుకున్నాం. ప్రజలకు జిల్లా కేంద్రాలకు వెళ్లడానికి గతంలో ఇబ్బందులు పడేవారు. కానీ ఇఫ్పుడు ఆ కష్టాలు లేవు. కొత్త జిల్లాలో అబివృద్ధి అద్భుతంగా సాగుతుంది. ఇటీవల కర్ణాటక బెంగుళూరుకు వెళ్లినప్పుడు అక్కడి మన పథకాలు అద్భుతంగా ఉన్నాయని అక్కడి మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి అన్నారు. ఆ రాష్ట్రంలో కూడా ఈ పథకాలు అమలు చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారని వారు చెప్పారు.. గ్రామీణ ఆర్థికవ్యవస్థను పరిపుష్టం చేయడానికి ప్రతి నియోజకవర్గం కేంద్రంలో మోబైల్ అంబులెన్స్ లు ఏర్పాటు చేసింది కూడా తెలంగాణ ప్ఱభుత్వమే....దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసులకు బేసిక్ సాలరీలో 30 శాతం అదనంగా ఇచ్చేది తెలంగాణ. ఇలా ఒక్కటి కాదు అనేక వర్గాల వారికి న్యాయం చేసిన ఘనత టీఆర్ ఎస్ ప్రభుత్వానిది. ఈ రోజు ప్రభుత్వానికి వస్తున్న మంచిపేరుకు మన కార్యకర్తలే కారణం. ఆ కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. కొన్ని విషయాలు చెప్పాలి. మన రాష్ట్రంలో 80ఏళ్ల నుంచి సాధ్యం కానీ భూ రికార్డుల ప్రక్షాళనను 100 రోజుల్లో పూర్తి చేశాం.. మిగితా రాష్ట్రాల వారు ఇది ఎలా సాధ్యమైందని మనల్ని అడుగుతున్నారు. ఇక రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తూ రైతుల గురించి ఇలా ఆలోచించిన రాష్ట్రం దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేదు. రైతాంగాని గురించి అంతలా ఆలోచిస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా చేయాలంటే ఆశామాషీ కాదు గంటల తరబడి ఆలోచిస్తూ...ఎప్పటికప్పుడూ సమీక్షిస్తూ చేస్తూ ఉన్నాం. ఇంతటి పథకాలు తీసుకరావడానికి మేధస్సును కరిగించి ప్రజలకు సేవ చేయాలన్న తపనతో ముందుకు వెళుతున్నాం. దేశంలోనే మన రాష్ట్రం నెంబర్ వన్ గా దూసుకెళుతుంటూ...దేశంలోని అన్ని రాష్ట్రాల వారు మనల్ని అభినందిస్తుంటే ఇక్కడ కొన్ని పార్టీలు మనపై ఇష్టం వచ్చినట్ల నోటికి ఎంత వస్తే అంత విమర్శలు చేస్తున్నారు.

ఈ మధ్య కొందరు చిల్లరమల్లర యాత్రలు పెట్టి విమర్శలు చేస్తున్నారు. నీకు టీపీసీసీ వచ్చిందంటే కారణం టీఆర్ఎస్ పార్టీ. 14 ఏళ్ల పాటు ఎన్నో త్యాగాలు చేస్తేనే రాష్ట్రం సిద్దించింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు ఆడుతున్నారు. 150 గదులతోని కేసీఆర్ ప్రగతి భవన్ కట్టుకున్నాడని ఆరోపిస్తున్నారు....సాయంత్రం ప్రగతి భవన్ కు రా....మీడియాను తీసుకొని రా...15 గదుల కంటే ఒక్కటి ఎక్కువ ఉన్నా నేను రాజీనామా చేస్తా. లేకుంటే నీ ముక్కు నేలకు రాస్తావా అని సవాల్ విసురుతున్నాను. మహారాష్ట్రం ఒప్పందం అప్పుడు ఇలాంటి విమర్శలు చేసారు. అప్పుడు రాజీనామా సవాల్ విసరితే పారిపోయారు. అనతికాలంలో 500 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశాం. ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్ ఏర్పాటు చేశాం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మీకు కనబడడం లేదా...మేము ఇచ్చిన పెన్షన్ లు కనబడడం లేదా...ఎన్నికల్లో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చింది టీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ హయాంలో తెలంగాణను సర్వనాశనం చేశారు. ఒకవైపు  తెలంగాణ రాష్ట్రలో అద్భుతంగా మూడు షిప్టులలో ప్రాజెక్టులు పనులు చేస్తుంటే కాంగ్రెస్ వాళ్లు కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారు. ఒర్వలేక కేసులు వేస్తున్నారు తప్పా మీరు చేసింది ఏమిటి...కాంగ్రెస్ కు చెందిని వేరే రాష్ట్రాల మంత్రులు మన పాలసీలను అభినందిస్తుంటే ఇక్కడి నేతలు మాత్రం కారుకూతలు కూస్తున్నారు. టీఆర్ఎస్ తెలంగాణను తెచ్చిన పార్టీ....తెలంగాణను అబివృద్ధిని చేస్తున్న పార్టీ. కాంగ్రెస్ పార్టీ 7 దశాబ్దాలు తెలంగాణను ఏలి సర్వనాశనం చేసింది. దేశంలోనే తెలంగాణ అగ్రశ్రేణిలో ఉంది. ఇక్కడి నుంచే దేశ రాజకీయాల గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. దేశంలోనే ఏ రాష్ట్రానికి రానట్లుగా వందలాది అవార్డులు తెలంగాణకు వచ్చాయి. ప్రపంచ స్థాయి సంస్థలు...కేంద్రసంస్థలు మన పథకాలను అభినందిస్తూ ఇతర రాష్ట్రాలు అమలు చేయాలని సూచిస్తున్నారు.

ఇంతకు మన పార్టీ తీర్మానం చేసినట్లు దేశ రాజకీయాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ క్రియాశీలంగా వ్యవహరించాలని తీర్మానించారు. నా సుదీర్ణ రాజకీయ అనుభవాల దృష్ట్యా దేశంలో జరగవల్సినది జరగడం లేదు. నేను నా రాజకీయకాలంలో ఎన్నో పదవులు చేపట్టాం. కానీ దేశానికి జరగాల్సిన మేలు జరగడం లేదు. దీనిలో భాగంగానే నేను ఒక ప్రకటన చేశాం. దేశానికి మేలు జరగడానికి ఒ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నామని పిలుపునిచ్చాం. దీంతో కొందరు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ నన్ను మోడీ ఏజెంట్ అంటున్నారు..ఇక్కడి బీజేపీ నేతలు కేసీఆర్ కు టెంట్ లేదు అని అంటున్నారు. వాళ్లకు ఎందుకింత భయం. దేశానికి దారి చూపడానికి మీ ప్రతినిధిగా నును ముందుకెళ్తా. ఎవ్వరికీ భయపడం. దేశంలో ఏదైనా చేయాలంటే కాంగ్రెస్ , బీజేపీలే చేయాలా...మనం చేయాలేమా...దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పాలించింది. బీజేపీ కూడా ఏళ్ల పాటు పాలించింది. వీళ్లు దేశానికి ఏం చేశారు. కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరి జలవివాదం కొనసాగుతుంది. కాంగ్రెస్ ,బీజేపీ  అసమర్థ నాయకుల వల్ల దేశంలో నీటి యుద్దాలు వస్తున్నాయి. దేశంలో మనకు 70వేల టీఎంసీ నీరు అందుబాటులో ఉంది. ఇంత నీరు ఉన్నా...మనకు నీటికి ఎందుకు కటకట అవుతుంది. ప్రకృతి సిద్దంగా ఉన్న నీటిని ఒక పద్దతి ప్రకారం వ్యవసాయానికి, పారిశ్రామికరంగాలకు , తాగు నీటికి వినయోగించుకుంటే ఇంకా 25 వేల టీఎంసీల నీరు మిగులు ఉంటుంది. కాంగ్రెస్ , బీజేపీ స్వార్థ రాజకీయాలతో దేశానికి అన్యాయం చేస్తున్నారు. మా ఫెడరల్ ప్రంట్ ద్వారా రానున్న ఏడేళ్ల కాలంలోనే 40 కోట్ల ఎకరాలకు నీరందిస్తాం. హైదరాబాద్ వేదికగా నేను ప్రకటిస్తున్నాను. ఈ రెండు పార్టీల దశాబ్దాల పాలనలో మన రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. కేవలం మన దేశంలో 2000 కిమీ మేర ఎక్స్ ప్రెస్ హైవేలు మాత్రమే ఉన్నాయి. గూడ్స్ రైళ్ల వేగంలో విదేశాలతో  పోల్చుకుంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. మనకు సముద్రతీర ప్రాంతం అద్బుతంగా ఉంటుంది. కానీ మనవాళ్లు ఇతర దేశాల బీచ్ ల పర్యటనకు వెళ్తున్నారు. పర్యాటకరంగాన్ని అబివృద్ది చేయడంలో ఈ రెండు ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. మనకు సువిశాలమైన  7500 కిమీ సముద్రతీర ప్రాంతం ఉన్నప్పటికీ మనం మాత్రం కేవలం కోటి కంటైనర్లు మాత్రమే మనం హ్యాండిల్ చేయగలుగుతాం. ఈ కాంగ్రెస్ , బీజేపీలను ఇంకా నమ్మాలా...ఈ రెండు పార్టీలు దశాబ్దాలతరబడి దేశ ప్రజలను మోసం చేస్తున్నాయి. మన పక్కనే ఉన్నా చైనా అభివృద్ధిలో దూసుకుపోతుంటే మన దేశం మాత్రం ఎందుకు వెనుకబడిపోతున్నాం. రాష్ట్రాలకు సంబంధించిన అనేక విషయాల్లో కేంద్రం ఫెత్తనం ఎందుకు ...ఆయా రాష్ట్రాల ఆలోచనలకు అనుగుణంగా అభివృద్ధి చేసుకుంటాయి కదా....మనం జీవన ప్రమాణం కేవలం 68 సంవత్సరాలు మాత్రమే. కొన్ని విషయాలను మాత్రమే నేను మీ ముందుకు తీసుకువచ్చా. నేను దేశంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడుతున్నాము. భూకంపం పుట్టించి ఏవిధంగానైతే తెలంగాణను సాధించామో...అలాగే రానున్న మూడు నెలల్లో అందరి నాయకులతో సంప్రదింపులు జరిపి దేశం బాగోగుల గురించి మేము ఆలోచిస్తున్నాము. దేశంలోని 135 కోట్ల మంది ప్రజలకు న్యాయం చేయడానికే మనం ప్రంటును ఏర్పాటు చేస్తున్నాము.

ఈ మధ్య కాలంలో నేను ఢిల్లీకీ వెళ్లినప్పుడు అక్కడి కొందరు జర్నలిస్టులు ప్రధానీ మోడీ గ్రాఫ్ తగ్గింది కదా వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టం కదా అన్నారు. నేను వారితో కూడా ఏకీభవించాను. బీజేపీ కాకపోతే కాంగ్రెస్ ...కాంగ్రెస్ కాకపోతే బీజేపీ ఇలా ఈ రెండు పార్టీలు మారుతున్నాయి తప్పా ప్రజల కష్టం మాత్రం తీరడం లేదు. నేను ఇక్కడే ఉండే ఇదే హైదరాబాద్ నుంచి దేశ రాజకీయాల్లో భూకంపం పుట్టిస్తామే. కాంగ్రెస్, బీజేపీలను దేశం నుంచి పారద్రోలి అందరినీ అబ్బురపరిచేలా దేశ ప్రజలకు అభివృద్దిని అందిస్తాం. కాంగ్రెస్, బీజేపీల అనాలోచిత విధానాలు. అసమర్థత వల్ల దేశానికి అన్యాయం జరగింది. ఇప్పటికే విలువైన 7 దశాబ్దాలు నష్టపోయాం. మీరు ఇచ్చే స్పూర్తితో గతంతో ఏవిధంగానైతే ముందుకెళ్లామో...అదే విధంగా మీ దీవెనలతో దేశ రాజకీయాల్లో ప్రభావశీలంగా, క్రియాశీలంగా వ్యవహరించి  తెలంగాణ గడ్డపేరున పలు నోళ్లు కొనియాడేవిధంగా  తెలంగాణ ఆత్మగౌరవ బావుట కాదు..తెలంగాణ గడ్డమీదే కాకుండా .దేశం ఆత్మగౌరబావుట ఎగురవేయడానికి మీ యొక్క సహకారంతో ముందకువెళుతున్నామని తెలుపుతూ సెలవుతీసుకుంటున్నాను.

జై తెలంగాణ

జై భారత్

అని నినాదాలు చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు కేసిఆర్.

loader