కేసిఆర్ కాంగ్రెస్ నాయకులకు సన్మానం చేయాలి

KCR should felicitate Congress leaders: Anjan Kumar yadav
Highlights

కేసిఆర్ సిగ్గు శరం లేదు

తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ తనదైన శైలిలో కేసిఆర్ పై విమర్శలు గుప్పంచారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏమన్నారంటే...

నాపై నమ్మకంతో నగర పార్టీ అధ్యక్షుడు గా నియమించినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కి కృతజ్ఞతలు. నాంపల్లి నుండి గాంధీభవన్ వరకు భారీ ర్యాలీతో వేలమంది తో గాంధీ భవన్ లో సభ నిర్వహిస్తాం. కాంగ్రెస్ కు పూర్వ వైభవం తేవడానికి కృషి చేస్తా. అధికారంలోకి వచ్చి 3సంవత్సరాలు కాకుండానే నగరంలో కార్పొరేట్  ఎన్నికలలో టీఆరెస్ ప్రభుత్వం ఏదో గోల్మాల్ చేసి గెలిచింది. నగరమంతా త్వరలో పాదయాత్ర చేస్తాను. ప్రజా సమస్యలపై నగర కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కేసీఆర్, మోడీ పై ప్రజలకు నమ్మకం పోయింది.

కులాల ప్రకారం తాయిలాలు ప్రకటిస్తూ ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నాడు. కేసీఆర్ చెప్పకముందే అన్ని కులలాలకు ముందే కుల సంఘాలు ఉన్నాయి. సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ రావడం అసాధ్యమయ్యేది. దళితులకు 3ఎకరాలు ఇస్తానని ,పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇస్తానని ఇవ్వలేదు. హైదరాబాద్ మేయర్ ఎన్నికల్లో టీఆరెస్ పార్టీ ఈవిఎం మిషిన్ టాపరింగ్ తో 100 కార్పొరేట్ సీట్లు గెలిచారు.

తెలంగాణ తేవడానికి కాంగ్రెస్ నాయకులు ఎంతో కృషి చేసారు. కేసీఆర్ కు సిగ్గు ,శరమ్ ఉంటే కాంగ్రెస్ నాయకులకు సన్మానం చేయాలి. కేసీఆర్ కు పాపం తగులుతుంది.

loader