Asianet News TeluguAsianet News Telugu

కెసిఆర్ చెప్పిన ఆంధ్ర సర్వే ఫలితాలివే

  • ఎపి సర్వే ఫలితాలు వెల్లడించిన సిఎం కెసిఆర్
  • ఢిల్లీలో మీడియాతో ముచ్చటించిన కెసిఆర్
  • వెంకయ్య నాయుడు లేకపోవడం దక్షిణాదికి నష్టమేనని వెల్లడి
  • ఓటుకు నోటు కేసు ఇంకా ముగిసిపోలేదు
  • నోట్ల రద్దు ఒరిగిందేమీ లేదని వెల్లడి
  • జిఎస్టీతో తెలంగాణకు లాభమన్న కెసిఆర్
kcr says ycp leads in ap politics

తెలంగాణ సిఎం కెసిఆర్ ఎపి రాజకీయాలపై బాంబు పేల్చారు. తన నోటీసుకు వచ్చిన ఎపి సర్వే ఫలితాలను ఆయన ఢిల్లీలో మీడియాతో పంచుకున్నారు. ఆ సర్వే ఫలితాలు రాజకీయాల్లో కలవరపాటుకు గురిచేసేలా ఉన్నాయి.

ఈ సర్వే ఫలితాలను తన మిత్రుడు తనకు చెప్పినట్లు కెసిఆర్ వెల్లడించారు. కెసిఆర్ చెప్పిన సర్వే ఫలితాలిలా ఉన్నయి.

45 శాతం సీట్లు సంపాదించి వైసిపి ముందంజలో ఉంది.

43శాతం సీట్లు సాధించి టిడిపి రెండో స్థానంలో ఉంది.

2.6 శాతం సీట్లు బిజెపి సాధిస్తుంది.

1నుంచి 1.2 శాతం సీట్లను మాత్రమే పవన్ కల్యాణ్ సాధిస్తాడు. అని తన మిత్రుడు ఇచ్చిన సర్వే రిపోర్టు ఇదే అని కెసిఆర్ మీడియతో తెలిపారు.

అయితే పవన్ కళ్యాణ్ పెద్దగా ప్రభావం ఏమీ చూపలేడని కెసిఆర్ అన్నారు. గతంలో చిరంజీవి పార్టీ పెట్టి కాంగ్రెస్ లో కలపలేదా అని గుర్తు చేశారు.

ఇక అనేక అంశాలపై సిఎం కెసిఆర్ మీడితో ముచ్చటించారు.

నోట్ల రద్దు ఫలితాలు ఏమొచ్చాయో అర్థం కావడంలేదన్నారు. నోట్ల రద్దు వల్ల వచ్చిన లాభాలేంటన్నది ప్రశ్నార్థకంగా మారిందన్నారు. మళ్లీ బ్లాక్ మనీ రిలయ్ రంగంలోకి వచ్చి చేరిందన్నారు. బ్యాంకుల నుంచి వెళ్లిన డబ్బు తిరిగి బ్యాంకులకు రావట్లేదన్నారు.

మోడీతో పలు అంశాలపై చర్చించినట్లు కెసిఆర్ వెల్లడించారు. సీట్ల పెంపు లేదని మోడీ స్పస్టం చేశారని ఎలగూ 2024లో పెరుగుతాయి కదా అని మోడీ అన్నట్లు చెప్పారు.

సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించాలని ఎపి సిఎం చంద్రబాబుకు తాను సూచించానని చెప్పుకొచ్చారు కెసిఆర్.

గతంలో తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెట్టించేందుకు కుట్ర చేశారని, కానీ వాటిని తిప్పికొట్టానని అన్నారు.

ప్రస్తుతం ఎపితో తమకు ఎలాంటి వైరం లేదన్నారు. ఓటుకు నోటు కేసు ఇంకా క్లోజ్ కాలేదన్నారు.

వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతిగా రావడం దక్షిణాదికి తీవ్రనష్టం కలిగించే అంశమే అన్నారు.

ఆయన లాంటి నాయకుడు తయారు కావడం ఇప్పట్లో సాధ్యం కాదన్నారు కెసిఆర్. జిఎస్టీ ద్వారా తెలంగాణ ఆదాయం గణనీయంగా పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు కెసిఆర్.