Asianet News TeluguAsianet News Telugu

సిద్ధిపేట మట్టిలో మొలిచిన మొక్కను నేను

  • నా గురువులు నేర్పిన సంస్కారంతో ఇంతటి స్థాయికి ఎదిగిన
  • అప్పటి సిఎం ఎన్టీఆర్ కారు ఆపి దరఖాస్తు ఇచ్చిన
  • సిద్ధిపేట జిల్లా కావాలని నా చిన్నపటినుంచి ఉన్న కోరిక
  • ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అయినంక తీరింది
KCR says his debt to siddipet is irrepayable

తెలంగాణ సిఎం కేసిఆర్ తనదైన శైలిలో ప్రసంగించారు. సిద్ధిపేట జిల్లాలో జరిగిన సభలో ఆయన ఆసక్తికరంగా మాట్లాడారు. సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ కు శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు... 


నాకు జన్మనిచ్చింది సిద్ధిపేట.
రాజకీయ జన్మనిచ్చింది కూడా సిద్ధిపేట.
పోరాడే బలమిచ్చింది సిద్ధిపేట.
ఎక్కడబడితే అక్కడ అనర్గళంగా మాట్లాడగలే గళమిచ్చింది సిద్ధిపేట. 
ఈ సిద్ధిపేట మట్టిలో మొలిచిన మొక్కను నేను. 
నా గురువులు నేర్పిన సంస్కారం, సభ్యతతో ఇంతటి స్థాయికి చేరుకున్నాను. 
సిద్ధిపేటలో నేనొక్కడినే కాదు హరీష్ రావు, రసమయి బాలకిషన్ ఎందరో ప్రముఖులు ఇక్కడి బిడ్డలే. ఈ సిద్ధిపేట మట్టికి అంత బలముంటది.
1983లో నేను ఎమ్మెల్యేగా ఓడిపోయి చింతమడకలో ఉన్న. అప్పుడు హరీష్ బడికి పోతున్నడు. ఆ సమయంలో అప్పటి సిఎం స్వర్గీయ రామారావు గారు సిద్ధిపేట నుంచి పోతున్నడు. నేను, బాలమల్లు అప్పుడు సిద్ధిపేట జిల్లా మ్యాపు గీయించి నేనే స్వయంగా అంబేద్కర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రిని ఆపి ఆ మ్యాప్ ఇచ్చి సిద్ధిపేట జిల్లా చేయాలని దరఖాస్తు ఇచ్చిన. కానీ ఏం అయిందో ఆయన జిల్లాను చేస్త అన్నడు కానీ చేయలేకపోయిండు. తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా సిద్ధిపేటను జిల్లా చేయలేకపోయిర్రు. కానీ నేను సిఎం అయినంకనే సిద్ధిపేట జిల్లాను చేసిన. 
ఇక్కడ మీటింగ్ అయిపోయినంక భోజనం చేసి ఇక్కడినుంచి సిరిసిల్ల పొమ్మని హరీష్ రావు చెప్పిండు. కానీ మిమ్మల్ని చూసినంక కడుపు నిండిపోయింది. తినే ఇంట్రెస్టు కూడా లేకుండపోయింది. 

దేశంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు మాత్రమే సంస్కరణలు చేసి జిల్లాలను పెంచుకోలేదు. తెలంగాణ వచ్చిన వెంటనే దేశంలో ఎవరూ చేయని సాహనం చేసి 10 జిల్లాలను 31 జిల్లాలు చేసుకున్నం. 
సిద్ధిపేట జిల్లా కావాలనుకున్నం జిల్లా వచ్చింది.
సిద్ధిపేట రైలు రావాలనుకున్నం రైలు వస్తున్నది. 

రానున్న ఏడాదిలో సిద్ధిపేట అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది. కోమటిచెరువుకు మరిన్ని నిధులు కావాలన్నరు. ఆ చెరువు అభివృద్ధి కి ఇంకో 25 కోట్లు మంజూరు చేస్త. నేను పోతెప్పుడు ఆ చెరువు కట్టమీంచే పోతా. 

సిద్ధిపేట ప్రజలు ఆదరించడంతోనే నేను ఇంతటి స్థాయికి వచ్చాను అని సిఎం కేసిఆర్ సొంతూరులో మనసు విప్పి మాట్లాడారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

https://goo.gl/JKVLp1  

 

Follow Us:
Download App:
  • android
  • ios