ఉస్మానియా విశ్వవిద్యాలయం అందించాలనుకుంటున్న గౌరవ డాక్టరేట్ కు ముఖ్యమంత్రి కెసిఆర్ విముఖం వ్యక్తం చేసినట్లు సమ ాచారం

కొందరికి డాక్టరేట్లు గౌరవం తెస్తాయి. కానీ మరికొందరు గౌరవం కోసం డాక్టరేట్లు కావాలని కోరుకుంటారు. జీవితంలో కష్టపడి చదువుకుని ఒక సబ్జెక్టును పూర్తిగా ఆకళింపు చేసుకుని పరిశోధనలు చేసి పిహెచ్‌డి గా డాక్టరేట్‌ తెచ్చుకోవడం వేరు !

ఈ మధ్య కాలంలో రాజకీయనేతలు, సినిమా నటులకు డాక్టరేట్లంటే మోజు బాగా పెరిగింది. వాటిని అందుకునే స్థాయి, అర్హ‌త త‌మ‌కు ఉందా లేదా అనే విషయాన్ని కూడా ఆలోచించడం లేదు. ఇదే స‌మ‌యంలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న యూనివర్సిటీలు అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి.

 ప్రశంసల బలహీనతను ఎరగా వేసి పబ్బం గడుపుకుంటున్నాయి. అమెరికాలోనికొన్ని వర్సిటీలకు కూడాఇందులో మినహాయింపు లేదు. యదేచ్చగా డాక్టరేట్లు ఇచ్చిపారేస్తుంటే.. కొందరు తమకున్న పలుకుబడి, డబ్బు వినియోగించి స్వీకరిసున్న విష‌యం తెలియ‌న‌ది కాదు.

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ( కెసిఆర్ ) ఆలోచ‌న మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ప్రపంచంలోనే అత్యంత ప్ర‌తిష్టాక‌ర‌మైన ఉస్మానియా విశ్వవిద్యాలయం ముఖ్య‌మంత్రి కెసిఆర్‌కు గౌర‌వ డాక్ట‌రేట్‌ ప్ర‌దానం చేయాల‌ని సూత్ర్ర‌ప్రాయంగా నిర్ణయించింది.

అయితే కెసిఆర్ మాత్రం ఇందుకు సుముఖంగా లేన‌ట్టు స‌మాచారం.!

2017 ఏప్రిల్ నెల‌లో ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యం శతాబ్ది ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు డాక్టరేట్‌ ప్రదానం చేయాలనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. అయితే దీనిని సిఎం సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌! ఇదిప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 తెలంగాణ ఉద్యమ నిర్మాతగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కెసిఆర్‌ చేపిన కృషికి గుర్తుగా గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయాలనే ప్రతిపాదనకు అందరూ ఓకే అన్నప్పటికీ.... కెసిఆర్‌ ను ఒప్పించే విషయంలో ఉప ముఖ్యమంత్రితో పాటు విశ్వవిద్యాలయం అధికారులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. గౌర‌వ‌

డాక్టరేట్‌ ఇస్తామంటే.... ఎవరైనా సరే... ఎగిరి గంతేస్తారు. ఇదేమిటి ? మన ముఖ్యమంత్రి కెసిఆర్‌ వద్దంటున్నారు ?

విచిత్రం క‌దా ! అని తెరాస వ‌ర్గాలు గుస‌గుస‌లాడుకుంటున్నాయి.ఇంతకీ కెసిఆర్‌ డాక్టరేట్‌ ప్రతిపాదనకు సుముఖంగా లేకపోడానికి కారణం ఏమిటి? కెసిఆర్‌ నిబద్ధత కలిగిన వ్య‌క్తి. ట. ఎటువంటిభేషజాలకు పోరు. పొగ‌డ్త‌ల‌కు లొంగిపోయి ఎవరినీ దగ్గరకు తీయరు. ప్రజల మనిషిఅనిపించుకోవాలే తప్ప ఇలా పరోక్ష గౌరవాలను స్వీకరించడం మంచిది కాదనేది ఆయన భావనగా ఉందట !

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో ఎంఏ చేసిన పూర్వ విద్యార్ధి కెసిఆర్ ! ఆయ తెలుగు భాష ప్రావీణ్యం గురించి ఎవ‌రూ కొత్త‌గా చెప్ప‌న‌క్క‌ర లేదు. డాక్ట‌రేట్ కు కావ‌ల‌సిన అర్ల‌హ‌త‌ల‌న్నీ ఆయ‌న‌కు ఉన్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయం గౌరవించే తొలి ముఖ్యమంత్రిగా ఆయనకు ఆ ఘనత దక్కుతుంది.

అయితే పిల్లి మెడలో గంట కట్టేదెవరు ? పాలక మండలి నిర్ణయించినప్పటికీ. కెసిఆర్ ను ఒప్పించ‌గ‌లిగే ధైర్యం ఎవ‌రికుంది? మీరిస్తానంటే ..నేనొద్దంటానా ,,?

ఇక ఇటువంటి విషయాల‌లో ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి స్ట‌యిలే వేరు ! గ‌త ఏడాది అమెరికాలోని షికాగో విశ్వవిద్యాలయం చంద్రబాబు కృషికి గుర్తింపుగా గౌర‌వ డాక్ట‌రేట్ ప్రకటించిందనప్పుడు టిడిపి నేతలు తెగ సంబరపడిపోయారు. ఆంధప్రదేశ్‌ అభివృద్ధికి, ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న కృషిని గుర్తించి అమెరికా ఇల్లినాయిస్‌ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్‌ షికాగో గౌరవ డాక్టరేట్ ప్రకటించిందని , ఒక విదేశీ రాజకీయ నేతలకు ఆ విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రకటించడం ఇదే ప్ర‌థ‌మం అంటూ పత్రికా ప్రకటనలు కూడా ఇచ్చేసారు ! అయితే కొంతకాలం తర్వాత తేలిందేమిటంటే షికాగో యూనివర్సిటీకి ,..షికాగో స్టేట్‌ యూనివర్సిటీకి తేడా ఉందని తెలిసింది. దీనితో అందరూ గప్‌చుప్‌ అయిపోయారు.

అమెరికాలోని విశ్వవిద్యాలయాలలో స్థాయి బేధాలు ఉంటాయి. ఆ తర్వాత చంద్రబాబు ఆ యూనివర్సిటీ డాక్టరేట్‌ స్వీకరించారనుకోండి.అది వేరే సంగ‌తి ! ఏది ఏమైనా..ప్రజలిచ్చే గౌరవానికి మించింది లేద‌నే విష‌యాన్ని రాజ‌కీయ‌వేత్త‌లు ఇప్ప‌టికైనా గ్ర‌హిస్తే మంచిది !