Asianet News TeluguAsianet News Telugu

టిఆర్ ఎస్ అధ్యక్షుడిగా కెసిఆర్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

kcr relected trs president unopposed again

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 

75లక్షల సభ్యత్వం ఉనన  పార్టీ అధ్యక్షుడిగా ఆయన  ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, హోం మంత్రి  నాయిని నర్సింహారెడ్డి ప్రకటించారు. ఫలితం ప్రకటిస్తూ ప్రజలందరూ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు , ఈ ఎన్నిక ప్రతిబింబించిందనిఅన్నారు.తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యమంత్రి అందరికీ ధన్యవాదాలు తెలిపారు.

 

రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావుతో కలిసి టీఆర్‌ఎస్ కొత్త అధ్యక్షుడి ఎన్నికను ప్రకటించారు. పార్టీ అధ్యక్ష పదవికి 11 నామినేషన్లు వచ్చాయి. అన్ని  సీఎం కేసీఆర్‌ పేరును  ప్రతిపాదిస్తూనే దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ అంశాన్ని రిటర్నింగ్ ఆఫీసర్ నాయిని నర్సింహారెడ్డి అధికారికంగా ప్రకటించారు.

 

ఫలితం ప్రకటించగానే తెలంగాణ భవన్ వద్ద టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు బాణాసంచాలు పేల్చి, స్వీట్లు పంచి సంబురం చేసుకున్నారు.

 

తర్వాత ప్లీనరీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు.పార్టీ 16వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ నగర శివారు కొంపల్లిలో తెలంగాణ ప్రగతి ప్రాంగణంలో భారీ ఎత్తున ప్లీనరీని నిర్వహి'స్తున్నారు.

 

టీఆర్‌ఎస్ ప్లీనరీ ప్రాంగణంలో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అంబలి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఎండ నుంచి ఉపశమనం కల్పించేందుకు అంబలి పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.  ప్లీనరీకి, అమెరికా, డెన్మార్క,యుకె, ఆస్ట్రేలియా తదితర ఏడు దేశాలనుంచి ప్రతినిధులు హాజరయ్యారు.

 

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి ప్లీనరీలో స్వాగతోపన్యసం చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios