Asianet News TeluguAsianet News Telugu

జూనియర్ డాక్టర్లకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్: 15 శాతం స్టైఫండ్ పెంపునకు ఆదేశాలు

జూనియర్ డాక్టర్ల వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

KCR orders to hike 15 percent stipend for junior doctors lns
Author
Hyderabad, First Published May 18, 2021, 2:29 PM IST

 
హైదరాబాద్: జూనియర్ డాక్టర్ల వేతనాలను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తమ వేతనాలు పెంచాలని  జూనియర్ డాక్టర్లు  డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి జూనియర్ డాక్టర్లు  ప్రభుత్వానికి లేఖ రాశారు. గత ఏడాది కరోనా సమయంలో  కూడ జూనియర్  డాక్టర్లు  కూడ తమ డిమాండ్ల విషయమై  నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించింది.  కరోనా రెండో వేవ్ సమయంలో కూడ తమ డిమాండ్లను పరిష్కరించాలని  జూనియర్ డాక్టర్లు   కోరారు. 

also read:జీతాలు పెంచాలని జూడాల లేఖ: సమ్మె చేస్తామని తెలంగాణ సర్కార్‌కి హెచ్చరిక

ఈ విషయమై జూనియర్ డాక్టర్లు  ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ ను కోరారు. ఈ డిమాండ్ ను   మంత్రి కేటీఆర్ సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. హౌస్ సర్జన్, పీజీల స్టైఫండ్ 15 శాతం పెంచాలని కేసీఆర్  హెల్త్ సెక్రటరీకి మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళే  ఈ విషయమై  జీవోను విడుదల చేయనున్నట్టుగా మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios