అధికార లాంఛనాలతో నేరేళ్ళ వేణు మాధవ్ అంత్యక్రియలు: కెసిఆర్ ఆదేశం

KCR orders  CS  to conduct funeral with state honours
Highlights

అధికార లాంఛనాలతో అంత్యక్రియలు


వరంగల్: మిమిక్రీ  కళాకారుడు  డాక్టర్ నేరేళ్ళ వేణు మాధవ్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో చేయాలని  తెలంగాణ సీఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు. మిమిక్రీ కళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చిపెట్టిన వ్యక్తిగా వేణుమాధవ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని కెసిఆర్ చెప్పారు.

మిమిక్రీ కలను పాఠ్యాంశంగా, అధ్యయనాంశంగా మలిచి మిమిక్రీ కలకు పితామహుడిగా పేరందారని చెప్పారు.  నేరేళ్ళ వేణు మాధవ్ మృతి కళా రంగానికి తీరని లోటని ముఖ్యమంత్రి  అభిప్రాయపడ్డారు.వేణు మాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడిన వేణుమాధవ్ మంగళవారం తుదిశ్వాస విడిచారు. 1932 డిసెంబర్ 28న మట్టెవాడలో వేణుమాధవ్ జన్మించారు. 

"

1972 నుంచి 1978 వరకు వేణుమాధవ్ ఎమ్మెల్సీగా పనిచేశారు. దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి అందరి ప్రసంశలు అందుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేరేళ్ల వేణుమాధవ్ ను విశిష్ట పురస్కారంతో గౌరవించింది.


ప్రముఖ మిమిక్రి కళాకారుడు, పద్మశ్రీ నెరేళ్ల వేణుమాధవ్ మృతిపట్ల ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మిమిక్రి కళకు నెరేళ్ల వేణుమాధవ్ చేసిన సేవలు గణనీయమైనవన్నారు. తెలంగాణ బిడ్డగా నెరేళ్ల అంతర్జాతీయ స్థాయికి ఎదిగి మిమిక్రి కి వన్నె తెచ్చారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్థించారు.

loader