తమిళనాడు (tamilnadu cm) ముఖ్యమంత్రి స్టాలిన్‌తో (mk stalin) తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి (third front)ఏర్పాటుపై చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా స్టాలిన్‌కు కేసీఆర్ ఆహ్వానించినట్లుగా సమాచారం.

తమిళనాడు (tamilnadu cm) ముఖ్యమంత్రి స్టాలిన్‌తో (mk stalin) తెలంగాణ సీఎం కేసీఆర్ (kcr) భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి (third front)ఏర్పాటుపై చర్చలు జరపనున్నట్లుగా తెలుస్తోంది. అలాగే యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా స్టాలిన్‌కు కేసీఆర్ ఆహ్వానించినట్లుగా సమాచారం. మిగిలిన ప్రాంతీయ పార్టీలతోనూ చర్చలు జరుపుతామని టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తెలిపారు. రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలకపాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. 

మంగళవారం నాడు Trs కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.Dmkనే కాదు దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీల నేతలను కూడా కలుస్తామన్నారు. తాము ఎవరితో కూడా గిల్లి కజ్జాలు పెట్టుకోబోమని ఆయన స్పష్టం చేశారు.టీఆర్ఎస్ పనైపోయిందని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేశారన్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ ప్రజా ప్రతినిధుల ఓట్లు గంప గుత్తగానే తమ పార్టీకే దక్కాయన్నారు.

Also Read:KCR Tamil Nadu Visit: నేడు తమిళనాడుకు సీఎం కేసీఆర్.. రంగనాథస్వామి ఆలయంలో పూజలు.. సీఎం స్టాలిన్‌తో భేటీ..!

మరో వైపు ఇతర పార్టీలకు చెందిన ఓట్లు కూడా తమ పార్టీ అభ్యర్ధులకు దక్కాయని ఆయన చెప్పారు. టీఆర్ఎస్ పనైపోయిందని ప్రచారం చేసిన వారికి ఈ ఎన్నికల ఫలితాలు చెంప పెట్టు అని ఆయన చెప్పారుకేంద్రంలోని Bjp అనుసరిస్తున్న విధానాలను ఆయన తప్పబుట్టారు. Cbse ప్రశ్న పత్రంలో మహిళలను కించపర్చేలా ఉన్న ప్రశ్న గురించి ఆయన ప్రస్తావించారు. విద్యా విధానంలో మార్పుల పేరుతో స్త్రీలను చులకనగా బీజేపీ చూస్తోందన్నారు. ఇందుకు ఈ ప్రశ్నాపత్రమే ఉదహరణగా ఆయన పేర్కొన్నారు. బీజేపీ కూడా ఓ ప్రాంతీయ పార్టీయేనని ఆయన సెటైర్లు వేశారు. కాంగ్రెస్ పార్టీ అతి చిన్న ప్రాంతీయ పార్టీగా ఆయన అభివర్ణించారు.