పెద్ద నోట్ల రద్దుపై ప్రధానంగా చర్చ విభజన సమస్యల పరిష్కారానికి వినతి

తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు సాయంత్రం ప్రధాని నరేంద్రమోదీ తో సమావేశమయ్యారు. పది నిమిషాల పాటు జరిగిన ఈ భేటీలో ప్రదానంగా పెద్ద నోట్ల రద్దుపై సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది.

నోట్ల రద్దు వల్ల గ్రామీణ ప్రజలు, రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వివరించినట్లు సమాచారం. అలాగే, కేంద్రం ఆకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఆదాయం భారీగా తగ్గిన అంశాన్ని, లోటును పూడ్చేందుకు కేంద్రం ఆర్థిక సాయం అందించాలని కోరినట్లు తెలిసింది.

అలాగే, సహకార బ్యాంకులకు నోట్ల మార్పిడిపై అవకాశం ఇవ్వకుండా ఆర్ బి ఐ తీసుకున్న నిర్ణయం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది.