హైదరాబాద్: ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను రద్దు చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది.  పరీక్షల నిర్వహణకు వీలు కాకపోతే  ఇంటర్  ద్వితీయ సంవత్సరం పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.ఇప్పటికే టెన్త్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను కూడ నిర్వహించలేదు.  ఇంటర్ ఫస్టియర్ విద్యార్ధులను ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు. కరోనా తీవ్రత తగ్గిన తర్వాత రెండో సంవత్సరం పరీక్షలను నిర్వహించాలని ప్లాన్ చేసింది. 

రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గకపోతే   పరీక్షలను రద్దు చేయాలని  ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ సెకండియర్ పరీక్షలను రద్దు చేస్తే ఫస్టియర్ లో వచ్చిన మార్కులనే విద్యార్ధులకు కేటాయించాలని  ప్రభుత్వం భావిస్తోంది. ఈ మార్కులపై అభ్యంతరాలు తెలిపే విద్యార్ధులకు అవసరమైన సమయంలో  పరీక్షలు రాసుకొనే అవకాశం ఇవ్వనుంది.  ఇప్పటికే ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్స్ ను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. సైన్స్ రికార్డుల ఆధారంగా  ప్రాక్టికల్స్ మార్కులు కేటాయించనున్నారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలకు 4,73,967 మంది ఫీజులు చెల్లించారు.