Asianet News TeluguAsianet News Telugu

ముందస్తు ఎన్నికలు: సెప్టెంబర్ 6న అభ్యర్థుల ప్రకటన?

 తెలంగాణలో ముందస్తు ఎన్నికల విషయమై కేసీఆర్  అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఈ తరుణంలో సెప్టెంబర్ మొదటివారంలో  కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు కన్నిస్తోంది. 

KCR likely to announce candidates on september 6
Author
Hyderabad, First Published Aug 24, 2018, 6:32 PM IST


హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల విషయమై కేసీఆర్  అడుగులు వేస్తున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు. ఈ తరుణంలో సెప్టెంబర్ మొదటివారంలో  కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు కన్నిస్తోంది. సెప్టెంబర్ రెండో తేదీన ప్రగతి నివేదన సభ ద్వారా కేసీఆర్ కీలక ప్రకటన చేసే అవకాశం లేకపోలేదని  పార్టీ వర్గాలు చెబుతున్నారు.

టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, టీఆర్ఎస్ శాసనసభపక్ష సమావేశం శుక్రవారం నాడు తెలంగాణభవన్ లో జరిగింది.ఈ సమావేశంలో  కేసీఆర్  కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో  కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంబంధించిన  అంశంపై సంకేతాలు ఇచ్చారు.

రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో ఏ రకమైన పథకాలను అమలు చేసిందనే విషయమై  విస్తృతంగా ప్రచారం చేయాలని కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులను కోరారు. 25 లక్షల మందితో  సెప్టెంబర్ రెండో తేదీన  జరిగే ప్రగతి నివేదన సభలో కీలకమైన ప్రకటన చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

అయితే  ప్రగతతి సభ ముగిసిన తర్వాత  కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. సెప్టెంబర్ 6వ తేదీన  అభ్యర్ధులను ప్రకటించే  అవకాశం ఉందని సమాచారం. ఆరో తేదీని కేసీఆర్ సెంటిమెంట్‌గా భావిస్తారు.

ఆరు లేదా అంతకంటే  ముందు  కేసీఆర్  అభ్యర్ధులను ప్రకటించే అవకాశాలు లేకపోలేదు.  సెప్టెంబర్ 4 నుండి 6వ తేదీలోపుగా కేసీఆర్ అభ్యర్ధులను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ వార్తలు చదవండి

ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చు: కేసీఆర్ ముందస్తు సంకేతాలు

20 రోజుల్లో రెండో సారి హస్తినకు కేసీఆర్: ముందస్తుపై పుకార్ల జోరు

సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ: కొంగరలో ఏర్పాట్లను పరిశీలించిన కేసీఆర్

 

Follow Us:
Download App:
  • android
  • ios