Asianet News TeluguAsianet News Telugu

సెప్టెంబర్ 2న ప్రగతి నివేదన సభ: కొంగరలో ఏర్పాట్లను పరిశీలించిన కేసీఆర్

రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో సెప్టెంబర్ రెండో తేదీన నిర్వహించే సభ ఏర్పాట్లను తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు పరిశీలించారు.

Telangana cm kcr visits Kongarakalan village for sep 2 meeting
Author
Hyderabad, First Published Aug 24, 2018, 1:32 PM IST

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్‌లో సెప్టెంబర్ రెండో తేదీన నిర్వహించే సభ ఏర్పాట్లను తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు పరిశీలించారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించే ఉద్దేశ్యంతో సెప్టెంబర్ 2వ తేదీన  రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో భారీ బహిరంగ సభను టీఆర్ఎస్ నిర్వహిస్తోంది. ఈ సభ నిర్వహణ కోసం  భూమి పూజను గురువారం సాయంత్రం మంత్రులు నిర్వహించారు.

"

సభ నిర్వహించే కొంగర కలాన్ ప్రాంతంలో ప్రదేశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం పరిశీలించారు. సభ నిర్వహణ కోసం తీసుకోవాల్సిన చర్యలను సీఎం పార్టీ నేతలకు సూచించారు.

సభా వేదిక, సభికుల ప్రాంగణం, పార్కింగ్ కోసం ప్రతిపాదించిన స్థలాలను పరిశీలించారు. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాది మంది తరలివస్తున్నందున, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులకు సూచించారు

 అవుటర్ రింగ్ రోడ్డు నుంచి సభా వేదికకు రావడానికి అనుగుణంగా ఇప్పుడున్న దారులతో పాటు అదనంగా మరికొన్ని దారులు నిర్మించాలని సిఎం చెప్పారు. సభాస్థలానికి రావడానికి అన్ని వైపుల నుంచి 15 నుంచి 20 రహదారులు నిర్మించాలని చెప్పారు. కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వ శాఖల నుంచి అనుమతి తీసుకోవాలని, వందకు వందశాతం పార్టీ నిధులనే వినియోగించాలని సిఎం సూచించారు.

 సభా స్థలి చుట్టూ కూడా సులభంగా రాకపోకలు నిర్వహించడానికి అనువుగా రహదారి నిర్మించాలని చెప్పారు. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహరెడ్డి, కెటి రామారావు, లక్ష్మారెడ్డి, మహేందర్ రెడ్డి, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత రెడ్డి, ఎంపిలు కె.కేశవరావు, జె.సంతోష్ కుమార్, బాల్క సుమన్, ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శంభీపూర్ రాజు, నగర మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేషన్ల చైర్మన్లు శేరి సుభాష్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, రాకేశ్ తదితరులున్నారు

 

 

ప్రగతి నివేదన సభ మైదానం (ఫోటోలు)

Follow Us:
Download App:
  • android
  • ios