ఇటు కరోనా, అటు సీజనల్ వ్యాధులు..రెండింటికి ఒకే వ్యూహంతో కేసీఆర్!

మరికొన్ని రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతుండడంతో సీజనల్ వ్యాధులు అధికంగా వచ్చే ఆస్కారం ఉంది. ముఖ్యంగా దోమకాటు వల్ల ఈ వ్యాధులు అధికంగా ప్రబలే ప్రమాదం ఉన్నందున ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయమై నిన్న ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.  

KCR Instructs Ministers And Officials On Seasonal Diseases Containment Plan

మరికొన్ని రోజుల్లో వర్షాకాలం ప్రారంభమవుతుండడంతో సీజనల్ వ్యాధులు అధికంగా వచ్చే ఆస్కారం ఉంది. ముఖ్యంగా దోమకాటు వల్ల ఈ వ్యాధులు అధికంగా ప్రబలే ప్రమాదం ఉన్నందున ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయమై నిన్న ప్రగతి భవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.  

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలిని, నెలకు ఐదుసార్లు సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేయాలని, మే నెల చివరి నాటికి రెండు సార్లు, జూన్ నెలలో ఐదు సార్లు ఇలా ఈ ద్రావణాన్ని పిచికారి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. 

చెత్తా చెదారం తొలగించాలని, దోమలు రాకుండా విరివిగా ఫాగింగ్, గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచడం వల్ల ఇవి కరోనా వ్యాప్తి నివారణకు, సీజనల్ వ్యాధులు రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుందని సీఎం ఈ సమావేశంలో అన్నారు. 

పట్టణాల్లో మేయర్లు, చైర్ పర్సన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్, ఎంపిటిసి, ఎంపిపి, జడ్పిటిసి, జడ్పీ చైర్ పర్సన్లు క్రియాశీలకంగా వ్యవహరించాలని, వారి వారి పరిధిలో గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు కేసీఆర్. 

ప్రజలను చైతన్య పరచాలని, ప్రభుత్వం యంత్రాంగంతో పని చేయించాలని, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పట్టణాలు, గ్రామాల పారిశుధ్య పనులపై తగిన సూచనలు చేయాలని సిఎం నిన్నటి సమావేశంలో తెలిపారు. 

ఇకపోతే....  నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేయాలని, ఈ నెల 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని సిఎం తెలిపారు. 

నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేయాలని, ఈ నెల 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త లాక్ డౌన్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మార్గదర్శకాలను పరిశీలించి, రాష్ట్రంలో అనుసరించే వ్యూహం ఖరారు చేస్తామని సిఎం తెలిపారు. 

కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు కొనసాగిస్తూనే, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.  కరోనా వ్యాప్తి నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు,  సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 

మంత్రులు ఈటల రాజేందర్, కెటి రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంత కుమారి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఎంఎయుడి కమిషనర్ సత్యనారాయణ, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, కమిషనర్ రఘునందర్ రావు, పోలీస్ కమిషనర్లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, సీనియర్ ఐపిఎస్ అధికారి జితేందర్ తదితరులు పాల్గొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios