పివి సింధుకు తెలంగాణ సిఎం కేసిఆర్ షాక్

KCR ignores PV Sindhu in announcing cash awards
Highlights

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు షాక్ ఇచ్చారు. 

హైదరాబాద్: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు షాక్ ఇచ్చారు. సింధుకు తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతి ఇచ్చేందుకు నిరాకరించింది.  గత నెల జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా నగదు బహుమతులు ప్రకటించారు. 

కామన్‌వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనానెహ్వాల్ కు రూ.50లక్షలు, మరో షట్లర్ ఎన్ సిక్కీరెడ్డికి రూ.30 లక్షలు, రుత్వికా శివానీకి రూ.20లక్షల నగదు బహుమతి ప్రకటించారు. పివి సింధును మాత్రం గుర్తించలేదు. 

బాక్సర్ ముహమ్మద్ హుస్సాముద్దీన్ కు రూ.25 లక్షల నగదు బహుమతిని కేసీఆర్ ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్సు అథారిటీ ప్రకటించింది. సైనాతోపాటు పీవీ సింధూ కామన్‌వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించింది. 

తెలంగాణ స్పోర్ట్సు అథారిటీ ప్రకటించిన నగదు బహుమతుల జాబితాలో సింధు పేరు లేదు. సింధు తెలంగాణ రాష్ట్రంలో పుట్టి, పెరిగింది. ఇక్కడే నివాసం ఉంటోంది. అయితే పివి సింధుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిప్యూటీ కలెక్టరు పదవి ఇచ్చింది. 

దాంతో ఆమెను ఆంధ్ర క్రీడాకారిణిగా భావించి పీవీ సింధుకు తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతి ఇచ్చేందుకు నిరాకరించినట్లు చెబుతున్నారు. 2016 ఒలింపిక్స్ క్రీడల్లో పీవీ సింధు పతకం సాధించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం రూ.5కోట్ల నగదు బహుమతినే కాకుండా హైదరాబాద్ నగరంలో ఇంటి స్థలాన్ని బహుమతిగా ఇచ్చింది.

loader