Asianet News TeluguAsianet News Telugu

కెసిఆర్ జ్ఞాపకశక్తి అపారం

త‌న‌తో మొద‌టి నుంచి ఉన్న వారంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌కు అపార‌మైన ప్రేమ. ఆయ‌న అధ్భుత‌మైన జ్ఞాప‌క శ‌క్తి క‌లిగిన గొప్ప నాయ‌కుడు.  ఉద్య‌మ స‌మ‌యంలో త‌న‌ను క‌లిసిన వారు ఎప్పుడు, ఎక్క‌డ క‌లిశారు, ఏం మాట్లాడారు అనే విష‌యాలు సిఎంకు బాగా గుర్తున్నాయి.

kcr has amazing memory power says his daughter kavita

త‌న‌తో మొద‌టి నుంచి ఉన్న వారంటే ముఖ్యమంత్రి కేసిఆర్‌కు అపార‌మైన ప్రేమ ఉంద‌ని, ఆయ‌న అధ్భుత‌మైన జ్ఞాప‌క శ‌క్తి క‌లిగిన గొప్ప నాయ‌కుడ‌ని నిజాం బాద్ ఎంపి కవిత పేర్కొన్నారు.

 

ఉద్య‌మ స‌మ‌యంలో త‌న‌ను క‌లిసిన వారు ఎప్పుడు, ఎక్క‌డ క‌లిశారు, ఏం మాట్లాడారు అనే విష‌యాలు సిఎంకు గుర్తున్నాయ‌ని చెప్పారు.

 

2001 నుంచి ఉన్న వారిని సిఎం గుర్తుపెట్టుకున్న న్యాయవాదుల  పేర్ల‌ను ఫుడ్  క‌మిష‌న్‌లో  స్వ‌యంగా సిఎం రాశార‌ని క‌విత వెల్లడించారు.

 

సోమ‌వారం హైద‌రాబాద్ ర‌వీంద్ర భార‌తిలో ఫుడ్ క‌మిష‌న్ ఛైర్మ‌న్ కొమ్మ‌ల‌ తిరుమ‌ల్ రెడ్డి, స‌భ్యులు వోరుగంటి ఆనంద్‌, కె. గోవ‌ర్ధ‌న్ రెడ్డి, రంగినేని శార‌ద‌, భానోత్ సంగూలాల్‌, మ‌ట‌కుంట్ల భార‌తిలు భాధ్య‌త‌లు తీసుకున్న సంద‌ర్భంగా జ‌రిగిన స‌భ‌లో క‌విత మాట్లాడారు.

 

 ఆహార భ‌ద్ర‌త చ‌ట్టాన్ని స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు చేస్తూ, పేద‌ల ఆక‌లి తీర్చందుకు కృషి చేయాల‌ని కోరారు.  వృత్తిరీత్యా న్యాయ‌వాదులు అయినందునే ఫుడ్ క‌మిష‌న్‌లో వారందరికి  ముఖ్య‌మంత్రి కేసిఆర్  అవ‌కాశం క‌ల్పించార‌న్నారు.

 

పేద‌ల ఆక‌లి తీర్చే అరుదైన అవ‌కాశం ల‌భించిన మీరు అదృష్ట‌వంతుల‌ని ఫుడ్ క‌మిష‌న్ స‌భ్యుల‌ను క‌విత‌ అభినందించారు.

 

 పాత‌,కొత్త‌ల మేలు క‌లయిక‌తో టిఆర్ ఎస్ పార్టీ తిరుగులేని శ‌క్తిగా ఎదిగింద‌ని క‌విత అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో శాస‌న మండ‌లి ఛీఫ్ విప్ పాతూరి సుధాక‌ర్ రెడ్డి,  విప్ గంప గోవ‌ర్ధ‌న్‌, ఎమ్మెల్సీ రాజేశ్వ‌ర్ రావు,  పౌర‌స‌ర‌ఫరాల కార్పోరేష‌న్ ఛైర్మ‌న్ పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, సాంస్కృతిక మండ‌లి ఛైర్మ‌న్ ర‌స‌మ‌యి బాల‌కిష‌న్‌, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు ర‌వీంద‌ర్ రెడ్డి,  రాష్ట్ర గ్రంధాలయ సంస్థ ఛైర్మ‌న్ ఆయాచితం శ్రీధ‌ర్‌, లాయ‌ర్స్ జెఎసి అధ్య‌క్షుడు రాజేంద‌ర్ రెడ్డి, శ్రీరంగారావు, ప‌లువురు టిఆర్ ఎస్ నేత‌లు హాజ‌ర‌య్యారు..

 

 


 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios