Asianet News TeluguAsianet News Telugu

మిగిలింది రెండున్నరేళ్లే...

తెలంగాణా ప్రభుత్వానికి అపుడే రెండున్నరేళ్లయింది. మిగిలింది రెండున్నరేళ్లే. ఇదే గడ్డు కాలం

KCR govt enters critical second half

 

 

సాధారణంగా సినిమా వాళ్లు వందరోజుల పండగలు, రజతోత్సవాలు జరగపుకుంటుంటారు. ఇపుడయితే, ఇవంత అట్టహాసంగా అభిమానుల పండగల్లలా  జరగడంలేదు. పూర్వం ఎన్టీఆర్, ఎఎన్ఆర్ ల స్వర్ణయుగంలో వందరోజుల పండగలు,రజతోత్సవాలు ఘనంగా జరిగేవి.  వందరోజులు ఆడిన సినిమా పోస్టర్లను, హీరో కటౌట్లను  పల్లెల్లో  కూడా అభిమాన సంఘాల వాళ్లు బండ్లకు కట్టుకుని వూరేగింపులుజరిగేవి.

 

 ఇలాంటి వందరోజుల పండగలు ఇపుడు రాజకీయాల్లోకి వచ్చాయి. వందరోజులే కాదు, మొదటిసంవత్సరం, రెండున్నరసంవత్సరాలు వచ్చాయి.  తెలంగాణా  ప్రభుత్వంలో  రెండున్నరేళ్లను పాటించాలనుకున్నారు.  ఈ సందర్భంగా ఒకభారీ బహిరంగ సభను కూడా ఏర్పాటుచేయాలనుకున్నారు. అయితే, మోదీ తీసిని నోట్ల దెబ్బతో అది  రద్దయిందని చెబుతున్నారు.

 

ఏమయినా సరే, టిఆర్ ఎస్ ప్రభుత్వానికి రెండున్నరేళ్లు పడ్డాయి. ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం ముఖ్యమయిన అతి కీలకమయిన రెండో ఘట్టంలో ప్రవేశించింది.  గడచిన అర్థభావం చాలా కలర్ ఫుల్ గా  సాగింది. 

 

రెండున్నరేళ్లలో లెక్కలేనన్ని సాంస్కృతిక పండగలు జరిగాయి. గోదావరి, కృష్ణ పుష్కరాలు, అమరవీరులసంస్మరణలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు,కొత్త జిల్లాలు, సరికొత్త ప్రాజక్టులు, పాటల, డప్పు డ్యాన్స్ లు, తెలంగాణా యావత్తూ నిత్యకల్యాణం పచ్చతోరణమయింది. ఇదే సంబురం రాజకీయాలలో కనపించింది. ఆంధ్రోళ్ల పార్టీ గా ముద్ర పడిన తెలుగుదేశం  పార్టీ దాదాపు ఖాళీ అయింది. ఆంధ్రోళ్ల ప్రభుత్వం ఆంధ్రాకి వెళ్లిపోయింది.

 

తెలంగాణాను ఇచ్చిన కాంగ్రెస్ కు కూడా చావుదెబ్బలు పడ్డాయి. మూకుమ్మడిగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు టిఆర్ ఎస్ కు వెళ్లి పోయారు.

 

అయితే,ముందున్న రెండున్నరేళ్లలో ఇలాంటి పండగల రక్తి కట్టించకపోవచ్చు. పార్టీ ఫిరాయింపులు  వుండకపోగా, కోర్టు కేసులు అసక్తి కరంగా మారవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఏమయిన చేసిందా లేదా అని ఆలోచించడం  మొదలుపెడతారు ప్రజలు.

 

ప్రభుత్వం  మునుపటి సంబురాలతో ముందుకు పోవడం కష్టం. ప్రతిపక్షాలు తమ దాడిని ఉధృతం చేయవచ్చు. రాష్ట్రంలో రాజకీయాలిక వేడెక్కవచ్చు. ఇరుపక్షాల్లోకోపతాపాలు పెరగుతాయి. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం గురించి ఇరువర్గాలేమనుకుంటున్నాయో చూద్దాం:

.

ఐటి మంత్రి కెటి  రామారావు : రెండున్నరేళ్ల టీఆర్‌ఎస్ ప్రభుత్వం సుస్థిరత సాధించిందని ఐటి, మునిసిపల్ మంత్రి కెటిరామరావు అంటున్నారు.  రాష్ట్ర ప్రజలకు భవిష్యత్‌పై భరోసా కల్పించామని ఆయన క్లెయిమ్ చేస్తున్నారు.   ఎందకంటే, హైదరాబాద్‌లో నేరాల సంఖ్య తగ్గాయి. పెట్టుబడులు పెరిగాయి, హైదరాబాద్ బ్రాండ్‌ఇమేజ్ పెంచాం.  ఇప్పటిదాకా 62 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. శాంతి భద్రతలు, వ్యవసాయం, నీటిపారుదల, విద్యుత్తు, తాగునీరు, విద్య, వైద్య రంగాల్లో భారీ ప్రణాళికలతో అనేక మైలురాళ్లు దాటుతున్నాం.. మన పథకాలను చూసి దేశమంతా నోరెళ్లబెడతా ఉంది. ఎక్కడ చూసినా  బ్రహ్మాండమైన అభివృద్ధి.

 

షబ్బీర్ (కాంగ్రెస్) : కేసీఆర్‌కు పాలనా అనుభవం లేకపోవడం వల్ల చాలా అనర్థాలొస్తున్నాయి. హామీలు అమలు చేయలేక పిట్టల దొరల మాటలతో రెండున్నరేళ్లు. ముఖ్యమంత్రి పాసయ్యింది అందంగా, ధైర్యంగా అబద్ధాలు చెప్పడంలోనే.   బంగారు తెలంగాణ  చీకటి  తెలంగాణ అయిపోయింది.

 

ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్) : టీఆరెస్ రెండున్నర సమృద్ధిగా అందరికి అందింది నిరాశే.  రాష్ట్రంలో ఏ వర్గమూ  సంతోషంగా లేదు. కేసీఆర్ ఫస్ట్ హాఫ్ పాలనలో మైలు రాళ్లు  రాజకీయ దిగజారుడు తనం, అవినీతి పేదోడికి అరవై గజాల ఇల్లు లేదు, తన కేమో  9 ఏకరాలలో 500 కోట్ల విలువచేసే ప్యాలెస్. నిత్యమూ జరిగేవన్నీ విలాసాలే. రైతుల ఆత్మహత్యలు చేసుకుంటే... కనీసం ఆ కుటుంబాలను ఓదార్చేందుకు కూడా కేసీఆర్, మంత్రులకు తీరికరికలేదు.

 

బిజెపి లక్ష్మణ్ : రెండున్నరేళ్ల టిఆర్ ఎస్  ప్రభుత్వానికి బిజెపి కొత్త  పేరుపెట్టింది. ఇది ’ఊరూర  బారు-నీరు’ ప్రభుత్వం అని పార్టీ తెలంగాణా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పేర్కొన్నారు.  టీఆర్‌ఎస్ ఏ హామీ అమలుచేయలేదు. దళితులకు మూడెకరాల భూమి, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం, ఫీజు బకాయిలు అన్ని సమస్యలలాగే ఉన్నాయి.

 

రేవంత్ రెడ్డి : ఇది పిచ్చి తుగ్లక్ పాలన. నగరాన్ని సీఎం కేసీఆర్, ఆయన కొడుకై న మంత్రి కేటీఆర్ నాశనం చేస్తున్నారు. ‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత మున్సిపల్‌శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కేటీఆర్ వంద రోజుల్లో మౌళిక వసతులను పూర్తిగా మెరుగుపరుస్తామని హామీ నిచ్చారు. వంద రోజులు దాటి పోయివంద రోజులైనా హైదరాబాద్‌లో రోడ్లెలాఉన్నాయో అందరికి తెలుసు. కెసిఆర్ పాలన హైదరాబాద్ రోడ్ల లాగానే ఉంది.

 

సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం : రెండున్నరేళ్లో తెలంగాణలో జరిగిందంతా అబద్ధాల సంబురం. ముఖ్యమంత్రి  గారడి చేసి నంబర్ వన్ అనిపించేకుంటున్నారు. ప్రభుత్వానికి రెండున్నరేళ్లే. అదేవిధంగా ఏమయిన మేలు జరగుతుందేమోనని ప్రజలు ఎదురుచూడబట్టి కూడా రెండున్నరేళ్ల లయింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios