బిసిలకు రాయితీ రుణాల కోసం 102 కోట్ల మంజూరు ఫైలు పై సిఎం కేసిఆర్ సంతకం హర్షం వ్యక్తం చేసిన బిసి మంత్రి జోగు రామన్న
బీసీలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు దీపావళి కానుకను అందజేశారు. బీసీ రుణాల సబ్సిడీ రూ.102.8 కోట్లు మంజూరు చేస్తూ.. దానికి సంబంధించిన దస్ర్తంపై శుక్రవారం సంతకం చేశారు. ఈ సబ్సిడీ రుణాల వల్ల రాష్ర్ట వ్యాప్తంగా 12, 218 మందికి లబ్దికి చేకూరనుంది. సబ్సిడీ రుణాలు మంజూరు కావడం పట్ల బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న హర్షం వ్యక్తం చేశారు. ఈ సబ్సిడీ నిధులను 12 ఫెడరేషన్స్‌కు చెందిన లబ్దిదారులకు సత్వరమే అందజేయనున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. బీసీలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన అన్నారు. స్వయం ఉపాధి ద్వారా బీసీ వర్గాలు మెరుగైన జీవనాన్ని సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు.
2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ సబ్సిడీ రుణాల వివరాలు ఇలా ఉన్నాయి.
బీసీ కార్పొరేషన్‌కు చెందిన 8,835 మంది లబ్దిదారులకు రూ.71.73 కోట్లు, నాయి ఫెడరేషన్‌కు చెందిన 906 మంది లబ్దిదారులకు రూ.8.40 కోట్లు, కుమ్మరి వర్గాల 806 మందికి రూ.6.79 కోట్లు, విశ్వ బ్రాహ్మణ వర్గాల 523 మందికి రూ.5.09 కోట్లు, వడ్డర వర్గాల 269 మందికి రూ. 2.42 కోట్లు, రజక వర్గాల 216 మందికి రూ.1.95 కోట్లు, గీత కార్మిక వర్గాల 138 మందికి రూ. 1.40 కోట్లు, సగర (ఉప్పర) వర్గాల 124 మందికి రూ.1.24 కోట్లు, కృష్ణ బలిజ (పూసల) వర్గాల 151 మందికి రూ. 1.22 కోట్లు, మేదర వర్గాల 187 మందికి రూ. 1.21 కోట్లు, వాల్మికీ (బోయ) వర్గాల 33 మందికి రూ. 33 లక్షలు, భట్రాజు వర్గాల 30 మందికి రూ. 30 లక్షలు చొప్పున సబ్సిడీ మంజూరైంది.
కేసిఆర్ సర్కారు గొర్రెల పథకంలో వింత అనుభవం చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి
https://goo.gl/hMBFkQ
