Asianet News TeluguAsianet News Telugu

Weekend political review: కేసీఆర్ కు ఆర్టీసీ సెగ, హుజూర్ నగర్ ఊరట


హుజూర్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలు కాావడం ఆ పార్టీకి తీవ్ర నిరాశను కల్గించింది. ఈ పరిణామం పీసీసీ చీఫ్ పదవిపై ఉత్తమ్ ను తప్పించాలనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ మొదలయ్యే అవకాశం కూడ లేకపోలేదు. 

KCR gets political gain, Uttam Kumar Reddy lose in Huzurnagar bypoll
Author
Hyderabad, First Published Oct 27, 2019, 9:55 AM IST


హైదరాబాద్:హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానంలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది.కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని టీఆర్ఎస్ గెలుచుకొంది. ఇక ఆర్టీసీయే ఉండదని తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఆర్టీసీ జేఎసీ నేతలతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. ఆర్టీసీ ఉండదని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. గత వారంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొన్నాయి.

Also Read:జగన్‌ను గెలిపించిన వైఎస్ఆర్, కూతురును గెలిపించుకోలేని కేసీఆర్: రేవంత్

ఈ నెల 21వ తేదీన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లొ టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి 43వేల ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు. 2009 నుండి ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో నల్గొండ నుండి ఎంపీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించాడు.

దీంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. ఉప ఎన్నికల్లో తన భార్య పద్మావతిని ఉత్తమ్ కుమార్ రెడ్డి రంగంలోకి దింపారు.  ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణికి ఈ ఎన్నికల్లో 69 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. సైదిరెడ్డి ఘన విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది.

Also Read:చర్చలు ఫెయిల్, అసలు లోగుట్టు ఇదే: వాళ్లు వెళ్లిపోయారు, వీరు ఉండిపోయారు

పోలింగ్ కు నాలుగు రోజుల ముందు సీఎం కేసీఆర్ హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా సీఎం కేసీఆర్ సభ రద్దైంది. ఈ సభ రద్దైన కూడ భారీ మెజారిటీతో కేసీఆర్ విజయం సాధించడంపై  టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకొంటున్నాయి.

హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ప్రజలకు ధన్యవాదాలు చెప్పేందుకు ఈ నెల 26న టీఆర్ఎస్ భారీ సభ నిర్వహించింది.ఈ సభలో సీఎం కేసీఆర్ హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించనున్నట్టు ఆయన  హామీ ఇచ్చారు.

ఇక ఆర్టీసీ జేఎసీ ఆధ్వర్యంలో కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించినందున  సీఎం కేసీఆర్ ఈ నెల 24 వ తేదీన మీడియా సమావేశంలో ఆర్టీసీ విషయమై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఆర్టీసీయే ఉండదని సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. సమ్మె చేస్తూ ఆర్టీసీని కార్మికులు మరింత నష్టాల్లోకి నెట్టారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వంలో ఆర్టీసిని విలీనం చేయడం సాధ్యమే కాదని ఆయన తేల్చి చెప్పారు. యూనియన్లు ఎన్నికల కోసమే సమ్మెకు పిలుపునిచ్చాయని ఆయన విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ ఉద్యోగులు విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ చెప్పారు.

సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు ఆర్టీసీ జేఎసీ నేత ఆశ్వత్థామరెడ్డి ఘాటుగానే స్పందించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్టీసీ విషయంలో తీసుకొచ్చిన చట్టంపై సీఎం కేసీఆర్ అవగాహాన పెంచుకోవాలని సూచించారు.ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని 2012లో కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు. 

ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి  కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ కూకట్‌పల్లి ఆర్టీసీ డిపోకు చెందిన డ్రైవర్ రాజు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. రాజు అనే డ్రైవర్ ఎవరో కూడ తమకు తెలియదని కూకట్‌పల్లి డిపోకు చెందిన ఆర్టీసీ జేఎసీ నేతలు తనకు చెప్పారని ఆర్టీసీ జేఎసీ కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డి చెప్పారు.

తనపై ఎవరు కేసు పెట్టించారో తనకు తెలుసునని ఆశ్వత్థామరెడ్డి కేసీఆర్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈ రకమైన కేసులతో తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు.

ఈ నెల 30వ తేదీన ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నిర్వహించతలపెట్టిన సకల జనుల సమర భేరిని సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నారు.ఈ సభకు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ, జనసేనలు మద్దతును ప్రకటించాయి.

ఈ నెల 28వ తేదీన ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో విచారణ జరగనుంది.ఈ తరుణంలో ఆర్టీసీ జేఎసీ నేతలతో ఈ నెల 26వ తేదీన ట్రాన్స్ పోర్ట్  సెక్రటరీ సునీల్ శర్మ, ట్రాన్స్ పోర్ట కమిషనర్ సందీప్ సుల్తానియాలు చర్చించారు.

అయితే 21 డిమాండ్లపై చర్చిస్తామని అధికారులు ప్రకటించారు. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. చర్చల నుండి మధ్యలోనే ఆర్టీసీ జేఎసీ నేతలు బయటకు వచ్చారు. మళ్లీ వస్తామని చెప్పి ఆర్టీసీ జేఎసీ నేతలు చర్చలకు రాలేదని ప్రభుత్వం ప్రకటించింది.


పీసీసీ మార్పుపై చర్చ

హుజూర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలు కావడంతో తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి మార్పు విషయమై మరో చర్చ సాగుతోంది. హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైన మరునాడే టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. పీసీసీ చీఫ్ పదవిని వేరేక నేతకు కట్టబెడుతారనే ప్రచారం సాగుతోంది.

కొంత కాలంగా పీసీసీ చీఫ్ పదవికి కొత్తవారిని ఎంపిక చేయాలనే చర్చ సాగుతోంది. అయితే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కొత్తవారికి ఈ పదవిని కట్టబెట్టాలని కాంగ్రెస్ నేతలు కొందరు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ పదవికి రేవంత్ రెడ్డిని గతంలోనే ఎంపిక చేయాలనే నిర్ణయానికి కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం వచ్చినట్టుగా ప్రచారం సాగింది.

అయితే ఈ పరిణామాలను గమనించిన రాష్ట్ర కాంగ్రెస్ కు చెందిన కొందరు నేతలు రేవంత్ రెడ్డికి ఈ పదవిని కట్టబెడితే తాము పార్టీని వీడుతామని కొందరు నేతలు హెచ్చరించడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు వెనక్కు తగ్గినట్టుగా సమాచారం. 

హుజూర్ నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్యను కూడ గెలిపించుకోలేకపోవడం అనేది ఆయనకు నష్టం కల్గిస్తోందనే అభిప్రాయం కూడ లేకపోలేదు.ఈ పరిణామంతో ఉత్తమ్ వ్యతిరేకులు పీసీసీ చీఫ్ పీఠం కోసం పావులు కదుపుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios