టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు నవంబర్ 11 వ తేదీన బీ ఫారాలు ఇవ్వనున్నారు. అదే రోజున 12  అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించే అవకాశం  ఉంది

హైదరాబాద్: టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు నవంబర్ 11 వ తేదీన బీ ఫారాలు ఇవ్వనున్నారు. అదే రోజున 12 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థులంతా అందుబాటులో ఉండాలని టీఆర్ఎస్ నాయకత్వం బుధవారం నాడు ఫోన్ చేసింది.

ఈ ఏడాది సెప్టెంబర్ 6 వ తేదీన 105 మంది స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులతో టీఆర్ఎస్ జాబితాను ప్రకటించింది. ఈ స్థానాల్లో అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. 105 మంది అభ్యర్థులకు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నవంబర్ 11వ తేదీన బీ ఫారాలు అందించనున్నారు.ఈ మేరకు టీఆర్ఎస్ అధిష్టానం బుధవారం నాడు బీ ఫారాలు తీసుకొనేందుకు నవంబర్ 11వ తేదీన అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫోన్లు చేశారు.

నవంబర్ 12వ తేదీన ఎన్నికల నోటీఫికేషన్ విడుదల కానుంది. దీంతో 11వ తేదీనే అభ్యర్థులందరికీ బీ ఫారాలు జారీ చేయనుంది టీఆర్ఎస్. ఇంకా ప్రకటించని 12 స్థానాల్లో కూడ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించనున్నారు.

ప్రకటించని స్థానాల్లో టికెట్టు కేటాయించే అభ్యర్థులను కూడ అందుబాటులో ఉండాలని టీఆర్ఎస్ నాయకత్వం ఫోన్లు చేసింది. ప్రతి ఒక్క అభ్యర్ధికీ ఒక్కో లాయర్ ను కేటాయించనున్నారు. నామినేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా ఉండేందుకు న్యాయవాదులను టీఆర్ఎస్ అభ్యర్ధులకు కేటాయించాలని ఆ పార్టీ నిర్ణయం తీసుకొంది.

ఈ నెల 24, 25,26 తేదీల్లో పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేటీఆర్ ప్రచారం నిర్వహించనున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో కేటీఆర్, హరీష్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

సంబంధిత వార్తలు

100 సీట్లు కేసిఆర్ మైండ్ గేమే: అంత సీన్ ఉందా...

కేసీఆర్‌పై అమీతుమీకి ఒంటేరు రె 'ఢీ': బాధ్యత హరీష్‌దే