క్రికెట్ లో కోహ్లీకి తిరుగులేదు.. తెలంగాణలో కేసీఆర్ కు ఎదురు లేదు : కల్వకుంట్ల కవిత

ఈ పోస్ట్‌పై తెలంగాణ కాంగ్రెస్ స్పందిస్తూ.. 'దేశం కోసం ఆడటానికి, కమీషన్ల కోసం ఆడటానికి తేడా ఉంది' అని కవితపై మండిపడ్డారు. 

KCR daughter praises Virat Kohli over his achievement, compares with her father - bsb

హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కుమార్తె కే కవిత బుధవారం క్రికెటర్ విరాట్ కోహ్లీని తన తండ్రితో పోలుస్తూ ప్రశంసించారు. వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ మీద ఇండియా సాధించిన గెలుపును, కోహ్లీ సాధించిన రికార్డులను ఆమె ప్రశంసించారు.

దీన్ని ఎక్స్ వేదికగా పంచుకుంటూ... "సీఎం కేసీఆర్ లాగానే విరాట్ కోహ్లీ కూడా ఓడలేడు! మాస్టర్స్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు మ్యాజిక్ జరుగుతుంది!" అంటూ ఓ ఫొటోను షేర్ చేశారు. అందులో ‘క్రికెట్ లో కోహ్లీకి తిరుగులేదు.. తెలంగాణలో కేసీఆర్ కు ఎదురు లేదు’ అని చెప్పుకొచ్చారు. 

బుధవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ భారీ విజయం సాధించి, 2023 ప్రపంచ కప్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తన 50వ వన్డే సెంచరీని సాధించి భారత మాజీ గ్రేట్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు.

ఈ పోస్ట్‌పై తెలంగాణ కాంగ్రెస్ స్పందిస్తూ.. 'దేశం కోసం ఆడటానికి, కమీషన్ల కోసం ఆడటానికి తేడా ఉంది' అని కవితపై మండిపడ్డారు. కాళేశ్వరం కుంభకోణంలో కేసీఆర్‌ను మించిన వారు లేరని, క్రికెట్‌లో విరాట్‌కు పోటీ లేదని మరో పోస్ట్‌లో కాంగ్రెస్ పేర్కొంది. నవంబర్ 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఇది జరిగింది. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios