కాంగ్రెస్ పై సీఎం కేసీఆర్ విమర్శ
నయీం లాంటి గ్యాంగ్ స్టర్ ను పెంచి పోషించింది కాంగ్రెస్ అని సీఎం కేసీఆర్ విమర్శించారు.
నయాం కేసును టీఆర్ ఎస్ ప్రభుత్వం నీరుగార్చుతోంది అని ప్రశ్నించిన జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
174 కేసులు, వెయ్యి ఎకరాలు కబ్జా చేసిన నయాంను పిశాచిగా కేసీఆర్ అభివర్ణించారు.
నయీం కోర్టు కేసుల నుంచి తప్పించుకోవటానికి సాక్షిగా ఉండి అప్రూవర్ గా మారిన వ్యక్తిని డీజీపీగా నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాదా అని ప్రశ్నించారు.
పదవీ విరమణ చేసిన తర్వాత ఆ మాజీ డీజీపీ రాజకీయాల్లో చేరినట్లు మీడియాలో కథనాలు కూడా వచ్చాయన్నారు.
అసత్య అరోపణలు చేయడం మానుకోవాలని కాంగ్రెస్ కు సూచించారు.
