మారిన ముహూర్తం: కుమారస్వామి లిస్టులో బాబు, కేసీఆర్

KCR and Chandrababu congratulate Kumaraswamy
Highlights

కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న జెడిఎస్ నేత కుమారస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. 

హైదరాబాద్: కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారం తేదీ మారింది. ఆయన ఈ నెల 23వ తేదీ బుధవారం 12.30 గంటలకు ప్రమాణ స్వీకారం చేస్తారు. సోమవారం ఈ నెల 21వ తేదీ రాజీవ్ గాంధీ వర్ధంతి కావడంతో ఆయన తన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేసుకున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న జెడిఎస్ నేత కుమారస్వామిని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. తన ప్రమాణ స్వీకారానికి కుమారస్వామి వారిద్దరిని కూడా ఆహ్వానించారు. 

ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 12, ఒంటిగంటలకు మధ్య ఆయన కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని మొదట అనుకున్నారు. తన ప్రమాణ స్వీకారానికి యుపిఎ చైర్ పర్సన్ సోనియా గాంధీని, కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆయన ఆహ్వానించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సరేసరి. 

చంద్రబాబు, కేసీఆర్ అభినందించిన విషయాన్ని కుమారస్వామి వెల్లడించారు. బిఎస్పీ నేత మాయావతి తనను ఆశీర్వదించారని ఆయన చెప్పారు. అన్ని ప్రాంతీయ పార్టీల చీఫ్ లను తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.

గవర్నర్ వాజూభాయ్ వాలాను కలిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. బలపరీక్షకు సిద్ధపడకుండానే యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 

loader