Asianet News TeluguAsianet News Telugu

కేసిఆర్ ఆ మాటతో బాబా రామ్ దేవ్ ఆశ్చర్యపోయాడు : కవిత

వెల్లడించిన ఎంపి కవిత

Kavita reveals what transpired between kcr and baba ram dev

కేసిఆర్, యోగా గురు బాబా రామ్ దేవ్ మధ్య జరిగిన ఆసక్తికరమైన సంభాషణలను నిజామాబాద్ ఎంపి కవిత బయటపెట్టారు. ఆర్మూర్ నియోజకవర్గం నంది పేట్ మండలం శివారు పల్గుట్ట సమీపంలో మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణానికి ఆమె శంకస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఎంపి కవిత మాట్లాడారు.

స్వయంగా రైతు అయిన కెసిఆర్ రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి అన్నారు. గత ప్రభుత్వాలు ఎర్రజొన్న రైతులకు చెల్లించాల్సిన 11కోట్ల రూపాయల బకాయిలను ప్రభుత్వమే చెల్లించిందని తెలిపారు. ఈ సీజన్లో జొన్నలను కొనుగోలు చేసేందుకు 100 కోట్ల రూపాయలను కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు రైతుల పట్ల ఎంత ప్రేమ ఉందో తెలియజేస్తోందన్నారు. వచ్చే నెల పదో తేదీ నుంచి ఎకరానికి 4000 రూపాయల చొప్పున రైతు బందు పథకం కింద పెట్టుబడి సాయాన్ని చేస్తున్నారని తెలిపారు. పెట్టుబడి సాయం గురించి కేంద్రమంత్రి అలాగే బాబా రామ్దేవ్ తిరిగి రైతులు ఎప్పుడూ చెల్లిస్తారని ముఖ్యమంత్రి కెసిఆర్ ను అడిగారని, రైతులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ చెప్పగానే వారు ఆశ్చర్యపోయారు అని ఎంపి కవిత వివరించారు.

గతంలో సర్కార్ దవాఖానకు వెళ్లాలంటే భయపడే పరిస్తితి ఉండేదన్నారు. బిడ్డ కడుపులో పడింది మొదలు తల్లీబిడ్డల బాగోగులను ప్రభుత్వమే చూసుకుంటున్నది అని తెలిపారు. ఆడ శిశువు జన్మిస్తే రూ 13 వేలు, మగ పిల్లాడు పుడితే రూ.12వేలు అందజేస్తూ..శిశువుకు అవసరం అయిన 13 రకాల వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ ను అందజేస్తారు అని కవిత వివరించారు. నంది పేట్ మండలంలోని 14 గ్రామాల్లో మున్నూరు కాపు సంఘాల భవనాలు నిర్మించాలని సంఘం నాయకుల కోరారని, గ్రామాల్లో పర్యటించినప్పుడు నిర్ణయం తీసుకుందామని చెప్పారు. అనంతరం పల్గుట్టలోని కేదారేశ్వర స్వామి, నంది పేట్ లోని నందీశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి, రెడ్ కో చైర్మన్ ఎస్.ఎ  అలీం,

నంది పేట్ ఎంపిపి యమున, జడ్పీటీసీ స్వాతి, టిఆర్ఎస్ నాయకులు బాదన్నగారి విఠల్ రావు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవన్న పటే ల్ తో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

మారంపల్లి లో ఘన స్వాగతం

నంది పేట్ మండలం మారం పల్లి గ్రామంలో నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత కు ప్రజలు ఘన్ స్వాగతం పలికారు. మత్స్యకారులు వారి సాంప్రదాయ వలతో గోపురం ఆకారంలో డప్పు చప్పుల్లతో కవిత ను తోడ్కొని వెళ్లారు. మహిళలు బొట్టుపెట్టి సాదరంగా ఆహ్వానించారు.అనంతరం పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు.అనంతరం డొంకేశ్వర్ గ్రామంలో నూ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాత్రి 10 గంటల వరకు  ఐలాపూర్ గ్రామంలో మన ఊరు - మన ఎంపి కార్యక్రమంలో ఎంపి కవిత పాల్గొన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios