పరిపూర్ణానంద నగర బహిష్కరణపై కత్తి షాకింగ్ కామెంట్

kathi mahesh shocking comments paripoornanada swami
Highlights

నతోపాటు స్వామి పరిపూర్ణానంద స్వామిని కూడా నగర బహిష్కరణ చేయడాన్ని కత్తి మహేష్ ఖండించారు.

హైదరాబాద్ నగర బహిష్కరణకు గురైన సినీ క్రిటిక్ కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనతోపాటు స్వామి పరిపూర్ణానంద స్వామిని కూడా నగర బహిష్కరణ చేయడాన్ని కత్తి మహేష్ ఖండించారు.

బహిష్కరణలు సమస్యకు పరిష్కారం కాదని, బహిష్కరణ ఆధునిక ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని కత్తి మహేష్ అన్నారు. మనుషుల్ని ‘తప్పిస్తే’ సమస్యలు తప్పుతాయనే ఆటవిక సమాజం దిశగా ప్రభుత్వాలు పయనిస్తే అది తిరోగమనమే అవుతుందని కత్తి మహేష్ ట్వీట్ చేశారు.
 
శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యాలు చేశాడంటూ కత్తి మహేష్‌పై హైదరాబాద్‌లో పలు కేసులు నమోదయ్యాయి. దీంతో నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని హైదరాబాద్ నుంచి కత్తి మహేష్‌ను బహిష్కరించిన విషయం తెలిసిందే. స్వయంగా తెలంగాణ డీజీపీ ప్రెస్‌మీట్ పెట్టి కత్తి మహేష్‌పై 6నెలల పాటు నగర బహిష్కరణ విధిస్తున్నట్లు ప్రకటించారు.
 
ఇక శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిపై కూడా హైదరాబాద్ పోలీసులు బహిష్కరణ వేటు వేశారు. గతంలో ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ.. వాటికి ఆయన సమాధానం చెప్పలేదంటూ పరిపూర్ణానందపై కూడా 6 నెలల బహిష్కరణ విధించారు.
 
హైదరాబాద్ నుంచి తొలుత బహిష్కరణకు గురైన కత్తి మహేష్.. తాజాగా హైదరాబాద్ పోలీసుల నుంచి బహిష్కరణ వేటు ఎదుర్కొన్న పరిపూర్ణానంద స్వామికి మద్దతుగా మాట్లాడడం ఆసక్తికరంగా మారింది. పరిపూర్ణానంద స్వామి బహిష్కరణను ఖండిస్తూ కత్తి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

loader