రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి.. దారుణంగా హత్య చేశారు. దీనికి స్థానిక ఎంపీపీ, ఆ ఊరివారే కారణం అని.. ఓ భూ వివాదంలో ఈ హత్య జరిగిందని సమాచారం.
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా కొత్తూరులో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి, హత్య చేశారు. కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి కారులో వెడుతుండగా చేగూర్ దగ్గర నిన్న కారును అడ్డగించి దుండగులు కిడ్నాప్ చేశారు. ఆ తరువాత అతడిని దారుణంగా హతమార్చారు. కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసిన అనంతరం దుండగులు అతడిని చితకబాదారు. కాళ్లు, చేతులు విరగొట్టిన కిడ్నాపర్లు యాక్సిడెంట్ అని గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు.
అయితే, కరుణాకర్ రెడ్డి అప్పటికే మృతి చెందినట్లు తెలిపిన వైద్యులు తెలిపారు. దీంతో నిందితులు అక్కడినుంచి ఐదుగురు నిందితులు పరారయ్యారు. ఈ నేపథ్యంలో గొడవలు జరగకుండా కరుణాకర్ రెడ్డి స్వస్థలం మల్లాపూర్ లో పోలీసుల మోహరించారు. ఓ భూమి వాదంలో ఎంపీపీ మధుసూదన్తో కరుణాకర్ రెడ్డికి వైరం ఉందని తెలుస్తోంది.15 మందితో కరుణాకర్ రెడ్డి హత్యకు రెక్కి నిర్వహించినట్లు సమాచారం.
షీ టీమ్స్ వేధింపులకు యువకుడి ఆత్మహత్య.. యువతి ఇంటిముందు మృతదేహంలో నిరసన.. 24 గంటలు గడిచినా..
ఓ భూ వివాదంలో హత్యజరిగిందని తెలుస్తోంది. కొంత కాలం క్రితం జరిగిన పంచాయతీలో కరుణాకర్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వచ్చిందని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో నలుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విష్ణువర్థన్ రెడ్డి, అరుణ్, అరిఫ్, విక్రమ్ రెడ్డి అనే నలుగురు కరుణాకర్ రెడ్డిని కిడ్నాప్ చేసినట్టుగా బావిస్తున్నారు. వారిని విచారిస్తున్నారు.
