Asianet News TeluguAsianet News Telugu

అభివృథ్తిపై గొప్ప థృక్పథం గల నాయకుడు: కేటీఆర్ తో భేటీపై కుమారస్వామి


  తెలంగాణ మంత్రి కేటీఆర్ తో  కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి ఆదివారం నాడు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఈ భేటీ గురించి కుమారస్వామి ట్విట్టర్ వేదికగా వివరించారు. 

 Karnataka Former CM  Kumaraswamy Appreciates KTR
Author
First Published Sep 11, 2022, 9:37 PM IST

హైదరాబాద్: వినూత్న ఆలోచనలు, అభివృద్ధిపై గొప్ప థృక్పథం ఉన్న నాయకుడు  తెలంగాణ మంత్రి కేటీఆర్ అని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అభిప్రాయపడ్డారు. కేటీఆర్  అభిమానం, విశ్వాసం  గౌరవంతో తన  హృదయం నిండిపోయిందని కుమారస్వామి చెప్పారు.

 

  ఇవాళ తెలంగాణ మంత్రి కేటీఆర్ తో భేటీ అయిన విషయాన్ని కుమారస్వామి ట్విట్టర్ లో ప్రకటించారు. కేటీఆర్ తో చర్చలు చాలా అర్ధవంతంగా సాగాయని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తో సమావేశం కోసం కుమారస్వామి ఇవాళ  హైద్రాబాద్ కు వచ్చారు.  జాతీయ రాజకీయాలపై కేసీఆర్ తో మూడు గంటల పాటు చర్చించారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని భావిస్తున్నారు. జాతీయ పార్టీని కూడా ఏర్పాటు చేయనున్నారు.

also read:దసరాలోపుగానే జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్:తేల్చేసిన కుమారస్వామి

ఈ విషయమై కేసీఆర్ తో చర్చించారు. జాతీయ రాజకీయాలతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులపై కూడా కేసీఆర్ తో కుమారస్వామి చర్చించారు.  కేసీఆర్ ఏర్పాటు చేసే పార్టీకి కుమారస్వామి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కేటీఆర్ తో కూడా కుమారస్వామి భేటీ అయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios