Asianet News TeluguAsianet News Telugu

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. పోటీకి దూరంగా బీఆర్ఎస్.. ఎందుకంటే ?

త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని బీఆర్ఎస్ భావిస్తోంది. ఆ రాష్ట్రంలో వచ్చే లోకసభ ఎన్నికల్లోనే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(ఎస్) అధినేత కుమారస్వామికి మద్దతుగా నిలవాలని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

Karnataka assembly elections..BRS away from competition..because? ISR
Author
First Published Mar 30, 2023, 9:17 AM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్ బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఆ రాష్ట్రంలో మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే మన రాష్ట్రానికే ఆనుకొని ఉన్న ఈ కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత్ రాష్ట్ర సమితిగా మారిన తరువాత దేశ వ్యాప్తంగా ప్రధానంగా జరిగే అన్ని ఎన్నికల్లో పోటీ చేయాలని మొదట భావించినప్పటికీ.. ప్రస్తుతానికి పక్కనే ఉన్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని అనుకుంటోంది.

పాకిస్తాన్ లో ఉచిత గోధుమ పిండి పంపిణీ కేంద్రాల్లో తొక్కిసలాట, 11 మంది మృతి, అనేకమందికి గాయాలు..

బీఆర్ఎస్ మొదట్లో పొరుగున ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలో అడుగు పెట్టాలని ప్రయత్నాలు చేసింది. కానీ 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల తరువాతే మిగితా అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలని తరువాత నిర్ణయించుకుంది. కానీ దానిని కూడా ఇటీవల పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సడలించారు. మహారాష్ట్రలో జరిగే లోకల్ బాడీ ఎన్నికల్లో అడుగు పెట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే అక్కడ బీఆర్ఎస్ ను రిజిస్టర్ చేశారు. పలు చోట్ల బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు. ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించారు. 

ఎన్నికల కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం కర్ణాటకలో ఇంకో రెండు నెలల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే అక్కడ జరిగే ఎన్నికల్లో ఈ సారి ప్రత్యక్షంగా పోటీ చేయకున్నా.. యాక్టివ్ గా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న నేపథ్యంలో దాని కంటే ముందుగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలను నిశితంగా పరిశీలించాలని అనుకుంటున్నారు. అక్కడి ఎన్నికలను అధ్యయనం చేసేందుకు త్వరలోనే ఓ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపినట్టు ‘సాక్షి’ తన కథనంలో నివేదించింది. ముఖ్యంగా అక్కడ బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ అనుసరించే వ్యూహాలపై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు. 

ఏప్రిల్ ఒకటి నుంచి టోల్ బాదుడు.. ఒకేసారి 5శాతం పెంపు...

ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బీదర్, రాయచూర్, యాద్గిర్, కొప్పల్, కలబుర్గి జిల్లాలో గతంలో హైదరాబాద్ స్టేట్ లో అంతర్భాగంగా ఉన్నాయి. అయితే ఇవి తెలంగాణకు ఆనుకొని ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ముఖ్యంగా ఈ జిల్లాలో పరిస్థితి ఎలా ఉండబోతుందో పరిశీలించనున్నారు. కొంత కాలం కిందట ఈ జిల్లాల్లో బీఆర్ఎస్ ను విస్తరించాలని ప్రయత్నాలు జరిగాయి. పార్టీ ముఖ్య నేతలు ఆయా జిల్లాలకు వెళ్లి, అక్కడి ప్రజాప్రతినిధులతో సమావేశాలు జరిపారు. కానీ తరువాత హడావిడి మందగించింది.

అయితే ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో జేడీ(ఎస్) ఒంటరిగా పోటీ చేస్తే ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కుమారస్వామికి మద్దతు తెలిపాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆయన కోసం బీఆర్ఎస్ అధినేత ప్రచారంలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇప్పటికే తనను బీజేపీ, కాంగ్రెస్ లు సంప్రదించాయని కుమారస్వామి ఇటీవల వెల్లడించారు. ఆ పార్టీలతో కలిసి జేడీ(ఎస్) వెళ్లాలని అనుకుంటే ఎలాంటి వైఖరి అవలంభించాలనే విషయంలో కూడా బీఆర్ఎస్ కసరత్తులు చేస్తోంది. 

'కోర్టు నన్ను దోషిగా నిర్ధారిస్తే..', రాహుల్ గాంధీ అనర్హత వేటు నిరసనలపై హిమంత బిశ్వ శర్మ ఫైర్

మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిని మళ్లీ సీఎం చేసేందుకు తన వంతు సాయం అందిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ గతంలో వెల్లడించారు. కానీ కొంత కాలంగా కేసీఆర్ నిర్వహించే కార్యక్రమాలకు కుమారస్వామి దూరంగా ఉంటున్నారు. గత సంవత్సరం నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ, ఢిల్లీలో జరిగి ఆ పార్టీ ఆఫీస్ శంకుస్థాపన, ఈ ఏడాది ఖమ్మంలో నిర్వహించిన పార్టీ బహిరంగ సభకు ఆయన హాజరుకాలేదు. గత నెలలో తెలంగాణ సచివాలయ ప్రారంభం జరిగింది. దీనికి తెలంగాణ సీఎం పలువురు విపక్ష నేతలకు ఆహ్వానాలు పంపించారు. కానీ కుమారస్వామికి ఆహ్వానం పంపలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరువురి మధ్య స్నేహం సన్నగిల్లిందని ప్రచారం జరుగుతోంది. అయితే కుమారస్వామి ఎన్నికల కార్యక్రమాల్లో బీజీ బీజీగా ఉన్నందునే ఈ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios