బైటపడ్డ టీఆర్ఎస్ నాయకుడి రాసలీలలు

karimnagar trs leader illegal affair
Highlights

తమ పార్టీ అధికారంలో ఉందని, నీ భర్తకు తన పలుకుబడి ఉపయోగించి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు నమ్మబలికాడు. అయితే అతడు ఓ గుడికి చైర్మన్ గా మంచి హోదాలో ఉండటంతో అతడు చెప్పింది నిజమని ఆ మహిళ నమ్మింది. అయితే ఇందుకోసం తన కోరిక తీర్చాలంటూ మహిళ పై ఒత్తిడి తెచ్చి చివరకు తన కోరిక తీర్చుకున్నాడు. అయినప్పటికి ఆమె భర్తకు ఉద్యోగం ఇప్పించకపోవడంతో మోసపోయానని గ్రహించి చివరకు పోలీసులను ఆశ్రయించింది. అక్కడా న్యాయం జరక్కపోవడంతో బాధితురాలు మీడియాకు తన గోడు వెల్లబోసుకుంది. 

కరీంనగర్ జిల్లా ఇల్లందు కుంటకు చెందిన ఎక్కటి సంజీవ్ రెడ్డి స్థానికంగా అధికార పార్టీ లీడర్. అంతే కాకుండా ఇతడు శ్రీ సీతారామస్వామి ఆలయ ఛైర్మన్ కూడా. అయితే ఇతడు ఓ వివాహితపై కన్నేశాడు. దీంతో తన భర్తకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ఆమెను లొంగదీసుకున్నాడు. అంతే కాకుండా ఆమె వద్ద ఉన్న భూమిని అమ్మించి ఆ డబ్బులను తానే తీసుకున్నాడు. అయితే ఇలా డబ్బులు తీసుకుని రెండేళ్లు గడుస్తున్నా తన భర్తకు ఉద్యోగం ఇప్పించకపోవడంతో సదరు మహిళ సంజీవ్ రెడ్డి నిలదీసింది. దీంతో అతడు మహిళతో పాటు భర్తపై కూడా దాడిచేశాడు.

దీంతో మోసపోయిన సదరు మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే స్థానికంగా అతడు పెద్ద లీడర్ కావడం, అందులోనూ అధికార పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో పోలీసులు కూడా కేసు నమోదు చేయడం లేదని బాధితురాలు వానోతుంది. దీంతో మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని బాధితురాలు తెలిపింది. తనకు న్యాయం చేయాలని ఆమె వేడుకుంటుంది. 
 
loader