లారీలను మాయం చేసే ఘరానా ముఠా అరెస్ట్.. (వీడియో)
ఇంటిముందు పార్క్ చేసిన లారీలను కూడా మాయం చేసే ఘరానా దొంగల ముఠాను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ లే కాకుండా ఏకంగా ఆటోలు, లారీలను సైతం క్షణాల్లో మాయం చేస్తారు. గంటల్లో దాని రూపురేఖలు మార్చి ఆనవాళ్లు సైతం లేకుండా చేస్తారీ ఘరానా దొంగల ముఠాను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
ఇంటిముందు పార్క్ చేసిన లారీలను కూడా మాయం చేసే ఘరానా దొంగల ముఠాను కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మోటార్ సైకిల్, మొబైల్ ఫోన్ లే కాకుండా ఏకంగా ఆటోలు, లారీలను సైతం క్షణాల్లో మాయం చేస్తారు. గంటల్లో దాని రూపురేఖలు మార్చి ఆనవాళ్లు సైతం లేకుండా చేస్తారీ ఘరానా దొంగల ముఠాను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
"
ఈ మేరకు ప్రెస్ మీట్ పెట్టిన పోలీసులు వివరాలు వెల్లడించారు.. కరీంనగర్ పట్టణానికి చెందిన మీర్జా మహమ్మద్ బేగ్, జీవనోపాధి కోసం లారీ నడుపుకుంటాడు. సెప్టెంబర్ లో బొమ్మకల్ బైపాస్ రోడ్డులో గల లారీ ఓనర్స్ అసోసియేషన్ దగ్గర, తన లారీని పార్క్ చేసి ఇంటికి వెళ్ళాడు.
మరుసటి రోజు కిరాయి కోసం వెళ్లామని తన లారీ వద్దకు వెళ్లగా తన పార్క్ చేసిన స్థలంలో లారీ కనపడలేదు. డ్రైవర్ ఏమైనా లారీని తీశాడేమోనని అనుమానంతో చుట్టుపక్కల చూసినా వారికి కనబడలేదు. దీంతో కంగారు పడి డ్రైవర్ ను సంప్రదించి లారీ జాడ తెలుసుకునే ప్రయత్నం చేసినా ఉపయోగం కనపడలేదు.
చివరికి లారీ దొంగతనం జరిగిందని తెలిసి గుండెలు బాదుకున్నాడు. ఈ లారీ దొంగలు ఆటోమొబైల్ ఫీల్డ్ లో తమకున్న అనుభవాన్ని ఉపయోగించుకుని, నిర్మానుష్యమైన ప్రదేశంలో పార్క్ చేసి ఉంచిన లారీలను ఆటోలను లక్ష్యంగా చేసుకొని దొంగిలించేవారు.
పొద్దున పూటంతా కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ పార్కు చేసిన లారీ, ఆటోలను గమనించేవారు. చుట్టుపక్కల ఎవరూ లేరు, దొంగిలించడానికి అనువుగా ఉందని గమనించి, అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగిలించేవారు.
తరువాత దొంగిలించిన వాహనాలను రాజీవ్ రహదారిపై గల టోల్ గేట్ తగలకుండా అడ్డ దారులలో హైదరాబాద్ కు తరలించి, హైదరాబాద్ పరిసర ప్రాంతానికి చేరుకున్న తర్వాత తమ ముఠా సభ్యులైన షేక్ ఫిరోజ్, ఆసిఫ్ నవాబ్ లకు ఫోన్ ద్వారా సమాచారం అందించేవారు.
ముందుగానే అనుకున్న ప్రదేశానికి వారిని పిలిపించుకొని వారికి ఆ లారీని అప్పగించే వారు. వాటి అమ్మకం ద్వారా వచ్చిన సొమ్మును మహమ్మద్ ఫహీం హుస్సేన్, రఫీక్ ఖాన్ మరియు సయ్యద్ యూసుఫ్ లు సమానంగా పంచుకునేవారు. అంతేకాకుండా వారు దొంగలించిన ఆటో నెంబర్లను మార్చి కొనుగోలు చేసిందేనని నమ్మ బలుకుతూ దర్ణాగా నడుపుకునేవారని పోలీసులు తెలిపారు.