Asianet News TeluguAsianet News Telugu

MLC elections : రవీందర్ సింగ్‌పై కరీంనగర్ మేయర్ సంచలన వ్యాఖ్యలు

టీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీకి రాజీనామా చేయకుండా శాసన మండలి ఎన్నికల్లో రవీందర్ సింగ్ (ravinder singh) చేసిన వ్యాఖ్యలను ఖండించారు కరీంనగర్ మేయర్ సునీల్ రావు. రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే నైతిక విజయం అంటారన్నది రవీందర్ సింగ్ తెలుసుకోవాలని సునీల్ రావు సూచించారు. 

karimnagar mayor sunil rao sensational comments on ravinder singh
Author
Karimnagar, First Published Dec 15, 2021, 9:20 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో (mlc elections) టీఆర్ఎస్ (trs) పార్టీ బలపర్చిన అభ్యర్థులు ఇద్దరూ ఘనవిజయం సాధించినందున వారికి శుభాకాంక్షలు తెలిపారు కరీంనగర్ మేయర్ (karimnagar mayor) సునీల్ రావు (sunil rao) . బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన టీఆర్ఎస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి పార్టీకి రాజీనామా చేయకుండా శాసన మండలి ఎన్నికల్లో రవీందర్ సింగ్ (ravinder singh) చేసిన వ్యాఖ్యలను ఖండించారు. రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే నైతిక విజయం అంటారన్నది రవీందర్ సింగ్ తెలుసుకోవాలని సునీల్ రావు సూచించారు. 

కార్పోరేటర్స్ ఇంటింటికి వెళ్లి ప్రలోభాలకు గురి చేసిన ఆధారాలు మా వద్ద ఉన్నాయని.. మా పార్టీ సభ్యులను మేము క్యాంప్‌లకు తీసుకెళ్లడం అనేది మా ఇష్టమన్నారు. టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కును రవీందర్ సింగ్ కోల్పోయారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో 986 ఓట్లు పూర్తి స్థాయిలో మాకే వచ్చాయని సునీల్ చెప్పారు. ఇతర పార్టీలతో ఆపవిత్ర పొత్తును పెట్టుకున్నా ఆయన గెలవలేదంటూ ఎద్దేవా చేశారు. రవీందర్ సింగ్ పదవి లేకపోతే వుండలేరని.. అందుకే పిచ్చిగా వాగుతున్నాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ALso Read:Karimnagar MLC Election 2021: ఎల్. రమణను ఓడించేందుకు మంత్రి గంగుల కుట్ర..: రవీందర్ సింగ్ సంచలనం (Video)

232 ఓట్లు వచ్చి నైతిక విజయం అనడం సిగ్గు చేటన్నారు. భవిష్యత్‌లో పోటీ చేయాలనుకుంటే మళ్ళీ గెలుస్తాననే నమ్మకం ఉంటే టీఆర్ఎస్ పార్టీ‌కి తక్షణమే రవీందర్ సింగ్ రాజీనామా చేయాలని సునీల్ రావు డిమాండ్ చేశారు. ఇతర పార్టీల వారు విమర్శిస్తే సమాధానం చెవుతాం కానీ టీఆర్ఎస్ పార్టీ తరువున గెలిచిన నీకు సమాధానం చెప్పే అవసరం తమకు లేదన్నారు. 

అంతకుముందు ఎల్.రమణ (l . ramana)ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించడానికి మంత్రి గుంగుల కమలాకర్ (gangula kamalakar) కుట్రలు చేసారని మాజీ మేయర్ రవీందర్ సింగ్ (ravinder singh) సంచలన వ్యాఖ్యలు చేసారు. కరీంనగర్ జిల్లా (karimnagar district)కే చెందిన బిసి నాయకులు రమణ ఎమ్మెల్సీగా గెలిస్తే ఎక్కడ తన మంత్రి పదవికి ఎసరు వస్తుందోనన్న భయంతోనే ఆయనను ఓడించడానికి గంగుల కుట్ర చేసారని ఆరోపించారు. భాను ప్రసాద్ (bhanuprasar rao) కంటే రమణకు తక్కువ ఓట్లు రావడమే మంత్రి గంగుల కుట్రకు నిదర్శనమన్నారు.  

కరీంనగర్ స్థానిక సంస్థల ఎన్నికల (karimnagar mlc election) ఫలితంపై రవీందర్ సింగ్ స్పందించారు. కరీంనగర్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ (TRS Party)కి చెందిన స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల ఓట్లను ఇద్దరు అభ్యర్థులు భాను ప్రసాదరావు, ఎల్.రమణకు టీఆర్ఎస్ అధిష్టానం సమానంగా పంచిందని అన్నారు. కానీ క్యాంపులో వున్న ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఎల్.రమణకు ఓడించడానికి గంగుల కుట్రలు చేసారు. అందువల్లే రమణకు 479 ఓట్లు వస్తే మరో టీఆర్ఎస్ అభ్యర్థి భానుప్రసాద్ కు 584 ఓట్లు వచ్చాయని రవీందర్ సింగ్ సంచలన కామెంట్స్ చేసారు.  

Follow Us:
Download App:
  • android
  • ios