Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్‌కు షాక్ ఇచ్చిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్.. ‘ఎమ్మెల్సీ’ నామినేషన్ దాఖలు

టీఆర్ఎస్‌కు కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ షాక్ ఇచ్చారు. అధికారపార్టీ ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ ఆ నిర్ణయాలను కాదని, సర్దార్ రవీందర్ సింగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు స్వతంత్రంగా నామినేషన్ దాఖలు చేశారు. తాను స్వతంత్రంగా ఎందుకు నామినేషన్ వేయాల్సి వచ్చిందో రేపు ఉదయం వెల్లడిస్తారని వివరించారు. ఎమ్మెల్సీ టికెట్‌ కోసం కొంత కాలంగా ఆయన వేచి చూస్తున్నట్టు సమాచారం. 
 

karimnagar ex mayor filed nomination for MLC election against TRS will
Author
Karimnagar, First Published Nov 23, 2021, 5:05 PM IST

హైదరాబాద్: TRS పార్టీ కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్(Sardar Ravinder Singh) షాక్ ఇచ్చారు. అధికార పార్టీ నిర్ణయించిన అభ్యర్థులను కాదని, సర్దార్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా MLC ఎన్నిక కోసం Nomination దాఖలు చేశారు. తన వెంటే ఎమ్మెల్యేలు, మంత్రులు నామినేషన్ వేయడానికి రాలేదేమో కానీ, ఓటర్లు చాలు కదా నామినేషన్ వేయడానికి అంటూ తనదైన శైలిలో ప్రశ్నించారు. ఆయన కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కోసం స్వంతంత్రంగా నామిషన్ దాఖలు చేసినట్టు విలేకరులకు వెల్లడించారు. మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ నామినేషన్‌తో పార్టీ వర్గాల్లో టెన్షన్ మొదలైంది.

నామినేషన్ల ప్రక్రియ పూర్తి కానుండటంతో చివరి నిమిషంలో తాను నామినేషన్ వేశారని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. అందుకే విలేకరులతో సమావేశం ఏర్పాటు చేసే వీలు చిక్కలేదని చెప్పారు. అయితే, రేపు ఉదయమే తాను విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి అంశాన్ని సమగ్రంగా తెలియజేస్తానని పేర్కొన్నారు. పార్టీ నిర్ణయాలను కాదని, తాను నామినేషన్ వేయడానికి పురికొల్పిన అంశాలు, వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే విషయాలనూ వెల్లడిస్తానని అన్నారు.

Also Read: MLC Elections: స్వతంత్ర అభ్యర్థులను అడ్డుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులు.. రంగారెడ్డి కలెక్టరెట్ వద్ద ఉద్రిక్తత..

ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ప్రకటిస్తారని మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఇంతకాలం ఎదురుచూసినట్టు తెలిసింది. అయితే, అనూహ్యంగా ఆయన పేరును టీఆర్ఎస్ అధిష్టానం ప్రకటించలేదు. దీంతో చివరి నిమిషంలో ఆయన నామినేషన్ వేశారు. ఎమ్మెల్సీ రేసులో సర్దార్ రవీందర్ సింగ్ లేకున్నప్పటికీ ఆయన నామినేషన్ వేస్తారా? వేయరా? అనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరిగింది. ఈ విషయమై ఆసక్తిగా చూశారు. పార్టీ నిర్ణయంతో సర్దుకుపోతాడేమో అనే వారికీ సమాధానం చెబుతూ ఈ రోజు సర్దార్ రవీందర్ సింగ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే, పార్టీ సీనియర్ నేతలు చర్చించి బుజ్జగిస్తే మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ కూడా తన నామినేషన్‌ను వెనక్కి తీసుకునే అవకాశాలు ఉన్నాయనే మాటలూ వినిపిస్తున్నాయి. వీటిపై స్పష్టత రావడానికి రేపటి వరకు వేచి చూడాల్సిందే. 

పార్టీ బీఫామ్ ఇవ్వలేదు కదా? అని అడిగితే.. రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరిగిపోవచ్చని, ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయని పార్టీ టికెట్‌పై తన ఆశన సర్దార్ వెల్లడించారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి తాను టీఆర్ఎస్ వెంట ఉన్నారని, కరీంనగర్‌కు వచ్చే వారందరితో తాను కలిసేవారని వివరించారు. స్థానిక సంస్థల బాధ్యులతోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయని తెలిపారు. కాబట్టి, ఎన్నికలో విజయం సాధిస్తాననే నమ్మకాన్నీ వెల్లడించారు. 

Also Read: ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్లు దాఖలు

టీఆర్ఎస్‌లోకి ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు ఇచ్చిన కమిట్‌మెంట్లు, పార్టీలోని నేతలనూ సంతృప్తి పరచడంలో పార్టీ అధిష్టానం కొంత కాలం మల్లగుల్లాలు పడింది. కేసీఆర్ ఢిల్లీ ప్రయాణించడానికి ముందే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు సమాచారం. తెలంగాణలో జరగనున్న మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఏడుగురిని పాత వారినే కొనసాగించే నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఐదుగురికి మాత్రమే ఈ అవకాశాన్ని సీఎం కేసీఆర్ కల్పించారు.

తమకు సరైన నిధులు, ప్రాతినిధ్యం, ప్రాధాన్య లభించడం లేదని ఎంపీటీసీలు, ఇదిలా ఉండగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టినట్టు కొన్ని వర్గాలు చెబుతున్నాయి.

గతంలో చాలా సార్లు ఇలాంటి ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం అధికార పార్టీకి కొంత శ్రమ తప్పేలా లేదు. స్థానిక సంస్థల్లో బలం లేని కారణంగా ఇప్పటికే బీజేపీ ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంది. కానీ, కాంగ్రెస్ మాత్రం మెదక్ సహా మరికొన్ని ప్రాంతాల్లో పోటీ చేస్తున్నది. చాలా సీట్లు టీఆర్ఎస్‌కే దక్కనున్నప్పటికీ కొంత ఉత్కంఠను మాత్రం ఈ ఎన్నికలు కలుగజేస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios