Asianet News TeluguAsianet News Telugu

MLC Elections: స్వతంత్ర అభ్యర్థులను అడ్డుకున్న టీఆర్‌ఎస్ శ్రేణులు.. రంగారెడ్డి కలెక్టరెట్ వద్ద ఉద్రిక్తత..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల (Local body mlc elections) అఖరి రోజు నామినేషన్ల సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ (Rangareddy collectorate) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ వేసేందుకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థులను టీఆర్‌ఎస్ నాయకులు (TRS Party) అడ్డుకున్నారు. కొందరి చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలు తీసుకుని చింపివేశారు.

Telangana MLC Elections Trs Workers stops independent candidates in Rangareddy collectorate
Author
Hyderabad, First Published Nov 23, 2021, 4:29 PM IST

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల (Local body mlc elections) అఖరి రోజు నామినేషన్ల సందర్భంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ (Rangareddy collectorate) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరఫున  శంభీపూర్ రాజు (shambipur raju), పట్నం మహేందర్ రెడ్డిలు (patnam mahender reddy) సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే వీరిద్దరు మంగళవారం కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుని మరో సెట్‌ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ క్రమంలోనే భారీగా టీఆర్‌ఎస్ శ్రేణులు వారి వెంట వచ్చారు. 

అయితే ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ వేసేందుకు వచ్చిన స్వతంత్ర అభ్యర్థులను టీఆర్‌ఎస్ నాయకులు (TRS Party) అడ్డుకున్నారు. కొందరి చేతుల్లో నుంచి నామినేషన్ పత్రాలు తీసుకుని చింపివేశారు. ఈ క్రమంలోనే ఇరువర్గాల ఘర్షణ నెలకొనడంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే పట్నం మహేందర్ పీఏ మల్లారెడ్డి తమపై దౌర్జన్యానికి పాల్పడ్డాడని స్వతంత్ర అభ్యర్థులు ఆరోపించారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి వచ్చిన తన నామినేషన్ పత్రాలను మల్లారెడ్డి లాక్కుని.. చించేశారని చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆరోపించారు. ఈ సంఘటనను వీడియో తీస్తున్న వారిపై కూడా దాడి చేశాడని తెలిపారు.

Also Read: Telangana Local body Mlc elections: ఖమ్మం, మెదక్ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ

మరోవైపు నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన తన చేతిలోని పత్రాలను చించివేశారని ఎంపీటీసీల సంఘం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు చింపుల శైలజ సత్యనారాయణ రెడ్డి (Chimpula Shailaja Satyanarayana Reddy) ఆరోపించారు. నామినేషన్ల పత్రాలను చించేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆడబిడ్డలపై ఇలాంటి దౌర్జన్యాలకు పాల్పడమేమిటని ఆమె మండిపడ్డారు. ఈ క్రమంలోనే తనను లోనికి పంపించాలని ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు లోనికి అనుమతించకపోవడంతో ఆమె రోడ్డుపై బైఠాయించారు.

ఇక, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌ నగర్, కరీంనగర్ జిల్లాలో రెండు స్థానాల చొప్పున, ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, మెదక్, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన చేపడతారు. ఈ నెల 26న ఉపసంహరణకు అఖరి తేదీగా నిర్ణయించారు. డిసెంబర్ 10న పోలింగ్ జరగనుండగా.. డిసెంబరు 14న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. 

అయితే ఈ ఎన్నికల్లో స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి వీలు ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న స్థానిక ప్రజా ప్రతినిధులలో 90 శాతం మంది టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వారే ఉన్నారు.  ఈ అంచనాల ప్రకారం.. TRS పార్టీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమనే టాక్ వినిపిస్తుంది. అయితే కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలాచారు. అయితే బీజేపీ మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్టుగా ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios