Asianet News TeluguAsianet News Telugu

బిజెపికి షాక్.... టీఆర్ఎస్‌‌లో చేరిన కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. అభర్థుల ప్రకటన తర్వాత ప్రతి పార్టీ అసమ్మతి నేతల ఆగ్రహానికి గురవుతోంది. ఇదే అలజడి ప్రస్తుతం బిజెపి పార్టీలో కొనసాగుతోంది. ఇటీవలే ఈ పార్టీ ప్రకటించిన మొదటి విడత అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి  పార్టీపై తిరుగుబాటు చేసి తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో  తనకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొంటూ మూడు పేజీలతో కూడిన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు పంపించిన విషయం తెలిసిందే.
 
karimnagar bjp president joins trs
Author
Karimnagar, First Published Oct 24, 2018, 4:00 PM IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయాలు వేడెక్కాయి. అభర్థుల ప్రకటన తర్వాత ప్రతి పార్టీ అసమ్మతి నేతల ఆగ్రహానికి గురవుతోంది. ఇదే అలజడి ప్రస్తుతం బిజెపి పార్టీలో కొనసాగుతోంది. ఇటీవలే ఈ పార్టీ ప్రకటించిన మొదటి విడత అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి  పార్టీపై తిరుగుబాటు చేసి తన పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో  తనకు తీవ్ర అన్యాయం జరిగిందని పేర్కొంటూ మూడు పేజీలతో కూడిన రాజీనామా లేఖను తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌కు పంపించిన విషయం తెలిసిందే.

తాజాగా ఇవాళ శ్రీనివాస్ రెడ్డి మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ తో పాటు ఎంపిలు వినోద్, పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి కేటీఆర్ ను కలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి ఆక్ష్న చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...నూతన రాష్ట్రం తెలంగాణలో సీఎం కేసీఆర్ నాలుగేళ్ల పాలన, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలు తనను ఎంతో ఆకర్షించాయని తెలిపారు. అయితే టీఆర్ఎస్ లో చేరడానికి  సమయం కోసం ఎదురుచేసానని...ఆ సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి చేరిపోయానని వివరించారు.   
 
బిజెపి పార్టీలో కష్టపడి పనిచేస్తున్న వారికి గుర్తింపు లేకుండా పోయిందని అందువల్లే రాజీనామా చేసినట్లు తెలిపారు. బీజేపీ పెద్దలు తనకు తీవ్ర అన్యాయం చేశారంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరడం ఆనందంగా ఉందన్నారు. 

సంబంధిత వార్తలు

 తెలంగాణ బిజెపికి తాకిన అసమ్మతి సెగ...జిల్లా అధ్యక్షుడి రాజీనామా

Follow Us:
Download App:
  • android
  • ios