బోర్డు తిప్పేసిన సాఫ్ట్ ఇంటిగ్రేటేడ్ మల్టీ టూల్స్ సంస్థ: కరక్కాయ స్కామ్ ఏమిటి?

karakkaya powder scam in Hyderabad
Highlights

:కరక్కాయ పొడి వ్యాపారం పేరుతో  హైద్రాబాద్‌లో భారీ మోసం జరిగింది.  బాధితుల నుండి  సుమారు రూ.5 కోట్లు వసూలు చేసిన సాప్ట్ ఇంటిగ్రేటేడ్ మల్టీ టూల్స్ సంస్థ బోర్డు తిప్పేసింది.  


హైదరాబాద్:కరక్కాయ పొడి వ్యాపారం పేరుతో  హైద్రాబాద్‌లో భారీ మోసం జరిగింది.  బాధితుల నుండి  సుమారు రూ.5 కోట్లు వసూలు చేసిన సాప్ట్ ఇంటిగ్రేటేడ్ మల్టీ టూల్స్ సంస్థ బోర్డు తిప్పేసింది.  దీంతో బాధితులు ఆ సంస్థ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

సాప్ట్ ఇంటిగ్రేటేడ్ మల్టీ టూల్స్ సంస్థ  కరక్కాయ పొడి వ్యాపారం నిర్వహించేది.  రూ.వందకు కిలో కరక్కాయలు ఇస్తారు. కరక్కాయల పొడిని ఆ సంస్థకే తిరిగి ఇస్తే రూ. కిలోకు రూ150 ఇవ్వనున్నారు. వెయ్యి రూపాయాలు డిపాజిట్ చేస్తే కిలో కరక్కాయలు ఇస్తారు.  ఈ కిలో కరక్కాయలను పొడిచేసి జాగ్రత్తగా అదే సంస్థకు అప్పగిస్తే అదనంగా మరో రూ300 చెల్లిస్తారు.

డబ్బులను ఆశగా చూపి ప్రజల నుండి డబ్బులను వసూలు చేసి ప్రస్తుతం దాన్ని మూసివేశారు. ఇవాళ డబ్బులు ఇస్తామని చెప్పడంతో బాధితులు  కార్యాలయం వద్దకు చేరుకొన్నారు.  కానీ, సంస్థ  కార్యాలయం వద్దకు  చేరుకొన్నారు.  కానీ సంస్థను మూసివేయడంతో  బాధితులు లబోదిబోమంటున్నారు.  ఈ విషయమై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హైద్రాబాద్‌ నుండి వరంగల్  వరకు కూడ కరక్కాయల వ్యాపారం వ్యాపించింది. వరంగల్‌లో కూడ  బాధితులు  ఉన్నారని తేలింది. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. 

లక్షలాది రూపాయాలు కూడ పెట్టుబడి పెట్టిన వారు కూడ ఉన్నారు. బుజ్జి అనే మహిళ కరక్కాయల వ్యాపారంలో ఏకంగా రూ.22 లక్షలు పెట్టుబడిగా పెట్టింది. కానీ, ఇంతవరకు ఆమెకు ఆ సంస్థ నుండి డబ్బులు రాలేదు.  తమకు న్యాయం చేయాలని బాధితులు  పోలీసులను  కోరుతున్నారు.
 


 

loader