నిజాం సాగర్ ఎస్సై అంతిరెడ్డి నిర్వాకం అర్థరాత్రి మహిళను చావబాదిన వైనం కొడుకు సెల్ ఫోన్ దొంగిలించాడని తల్లికి శిక్ష ఒంటిపై వాతలు పడేలా కొట్టిన ఎస్సై ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపు

ఆయన పేరు అంతిరెడ్డి. ఆడలేదు మగ లేదు ఎవరినైనా చితకబాదడం, బెదిరించడం ఆయన నైజం. ఆయన కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ఎస్సైగా పనిచేస్తున్నడు. నిన్న ఆయన ఒక మహిళను చితకబాదిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాదితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండలం కోమలంచ గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి మొబైల్ దొంగతనం చేసిండన్న ఆరోపణలతో రాజును అదుపులోకి తీసుకుని విచారించిండు అంతిరెడ్డి. దెబ్బలు తట్టుకోలేక ఆ యువకుడు రజు దొంగతనం చేసిన ఫోన్ ను అమ్మి ఆ డబ్బులు మా అమ్మకు ఇచ్చిన అని చెప్పిండు. దీంతో రగలిపోయిన ఎస్సై అర్ధ రాత్రి 1గంటలకు రాజు ఇంటికి వెళ్లి నానా హంగామా చేసిండు. నీ కొడుకు పైసలిచ్చిండట, ఏడ వెట్టినవ్ అని బెదిరించిండు రాజు తల్లి కుర్మ బాలమ్మను. నాకు తెలవదు అని ఆ తల్లి బతిమాలినా ఊరుకోలేదు. కాళ్లమీద పడ్డది ఆ కుర్మ బాలమ్మ. అయినా కనికరించలేదు ఎస్సై. దీంతో బిపి పెంచుకున్న అంతిరెడ్డి రాజు తల్లి బాలమణిని ఇష్టమొచ్చినట్లు కొట్టిండు.

అదే రాత్రి జీప్ లో ఎక్కించుకుని తీసుకుపోయిండు. తాను కొట్టినట్లు ఎవరికైనా చెప్పితే చంపుతానంటూ బెదిరింపులకు గురిచేసిండు. తర్వాత ఊరి పొలిమేరలో ఆమెను వదిలేసి వెళ్లిపోయిండు ఎస్సై అంతిరెడ్డి.

అర్దరాత్రి పూట మహిళను చితకబాదిన ఎస్సై అంతిరెడ్డి తీరు పట్ల జనాలు ఆగ్రహంగా ఉన్నారు. అంతిరెడ్డిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.