Asianet News TeluguAsianet News Telugu

ఓటమి తర్వాత తొలిసారిగా తెలంగాణ భవన్ కు కేసీఆర్: కృష్ణా పరివాహక ప్రాంత నేతలతో భేటీ

కేఆర్ఎంబీకి  ప్రాజెక్టుల అప్పగించిందనే ఆరోపణల నేపథ్యంలో  ఉద్యమానికి  భారత రాష్ట్ర సమితి  వ్యూహరచన చేస్తుంది.  కృష్ణా పరివాహక ప్రాంతానికి చెందిన నేతలతో కేసీఆర్  ఇవాళ సమావేశమయ్యారు.

 Kalvakuntla Chandrashekar Rao First time enter after Elections in Telangana Bhavan lns
Author
First Published Feb 6, 2024, 12:58 PM IST


హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి  అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మంగళవారంనాడు  తెలంగాణ భవన్ కు వచ్చారు.  తుంటి ఆపరేషన్ చేసుకున్న తర్వాత  తొలిసారిగా ఆయన  తెలంగాణ భవన్ కు వచ్చారు.  కేసీఆర్ కు మంగళహారతులతో  పార్టీ మహిళా విభాగం నేతలు స్వాగతం పలికారు.

కృష్ణా పరివాహక ప్రాంత జిల్లాల్లోని నేతలతో  కేసీఆర్  సమావేశం అయ్యారు. కేఆర్ఎంబీకి  ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం అప్పగించిందని  బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అయితే  తమ ప్రభుత్వం అలాంటి ప్రతిపాదన చేయలేదని  మంత్రులు చెబుతున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోని  మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నేతలతో  కేసీఆర్ ఇవాళ సమావేశమయ్యారు.  

also read:బీఆర్ఎస్‌కు షాక్: కాంగ్రెస్‌లో చేరిన పెద్దపల్లి ఎంపీ వెంకటేష్

తమ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలో ఉన్న సమయంలో ప్రాజెక్టులను  కేఆర్ఎంబీకి కేటాయించలేదని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.   ఈ విషయమై  బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతుంది.   కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగించడంపై రాష్ట్రానికి ఏ రకంగా అన్యాయం జరుగుతుందనే విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా  ప్రచారం చేయాలని బీఆర్ఎస్ భావిస్తుంది.ఈ విషయమై  ఏ రకమైన వ్యూహంతో వెళ్లాలనే దానిపై  పార్టీ నేతలతో  కేసీఆర్ చర్చించనున్నారు. కేఆర్ఎంబీకి  ప్రాజెక్టుల అప్పగింతను నిరసిస్తూ  ఈ నెల 22న  నల్గొండలో  భారీ బహిరంగ సభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ విషయమై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చిస్తున్నారు.

also read:పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్:మహబూబాబాద్‌ నుండి అత్యధికంగా ధరఖాస్తులు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు  తెలంగాణ భవన్ కు కేసీఆర్ వచ్చారు.  ఎన్నికల తర్వాత  కేసీఆర్ తెలంగాణ భవన్ కు రాలేదు.  అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ తుంటికి శస్త్రచికిత్స జరిగింది.  దీంతో ఆయన  ఇంటికే పరిమితమయ్యారు. ఈ గాయం నుండి కోలుకున్న తర్వాత  కేసీఆర్  ఈ నెల  1వ తేదీన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios