పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్:మహబూబాబాద్‌ నుండి అత్యధికంగా ధరఖాస్తులు

పార్లమెంట్ ఎన్నికల కోసం తెలంగాణ కాంగ్రెస్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తుంది. గెలుపు గుర్రాలను  అభ్యర్ధులుగా ఎంపిక చేయాలని భావిస్తుంది. ఇప్పటి వరకు అందిన ధరఖాస్తుల్లో విజయావకాశాలు ఉన్న అభ్యర్థులపై  ఆ పార్టీ ఫోకస్ పెట్టింది.
 

 309 aspirants for Congress Lok Sabha tickets in Telangana lns


హైదరాబాద్:పార్లమెంట్ ఎన్నికల్లో  మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలనే వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ  ప్లాన్ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం ఈ నెల  6వ తేదీ సాయంత్రం గాంధీ భవన్ లో  సమావేశం కానుంది.

రాష్ట్రంలోని  17 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ  నాయకత్వం ఆశావాహుల నుండి ధరఖాస్తులను ఆహ్వానించింది. 309 మంది అప్లికేషన్లు అందాయి.నియోజకవర్గాల ఆశావాహుల నుండి అందిన ధరఖాస్తులను కాంగ్రెస్ పార్టీ  స్క్రీనింగ్ కమిటీ  ఇవాళ  పరిశీలించనుంది. పలువురు రిటైర్డ్ అధికారులు కూడ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టిక్కెట్టు కోసం ధరఖాస్తు చేసుకున్నవారిలో ఉన్నారు.

2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మూడు పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంది. 2018 లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో  భారత రాష్ట్ర సమితి రెండో దఫా విజయం సాధించిన విషయం తెలిసిందే.  2023 నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  విజయం సాధించింది.  దీంతో  పార్లమెంట్ ఎన్నికలపై  కూడ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. రాష్ట్రం నుండి సోనియా గాంధీని పోటీ చేయాలని  కూడ  ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.ఈ మేరకు  తీర్మానం కూడ చేశారు.ఈ విషయమై  ఈ నెల  5న  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. మరోసారి ఈ విషయమై చర్చించారు.  అయితే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని సోనియా గాంధీ హామీ ఇచ్చారు.

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు  కాంగ్రెస్ పార్టీకి  ఆశావాహుల నుండి  భారీగా స్పందన వచ్చింది.  ఒక్కో పార్లమెంట్ స్థానం నుండి సగటున 18 మంది  పోటీ పడుతున్నారు. రాష్ట్రంలోని  మహబూబాబాద్ లోక్ సభ టికెట్టు కోసం 47 మంది ధరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా ధరఖాస్తులు వచ్చిన పార్లమెంట్ స్థానం ఇదే.  మరోవైపు అత్యల్పంగా  మహబూబ్ నగర్  పార్లమెంట్ స్థానం నుండి నలుగురు మాత్రమే ధరఖాస్తు చేసుకున్నారు.వరంగల్ నుండి 40 మంది, పెద్దపల్లి  నుండి 29 మంది, భువనగరి నుండి 28 మంది జహీరాబాద్  నుండి  ఆరుగురి ధరఖాస్తు చేసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

also read:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది: రాజ్యసభలో వైఎస్ఆర్‌సీపీ విజయసాయి రెడ్డి

సికింద్రాబాద్ నుండి కోదండరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్,  ఫిరోజ్ ఖాన్, వేణుగోపాలస్వామి, నల్గొండ నుండి పటేల్ రమేష్ రెడ్డి, రఘువీర్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డి, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, శోభారాణి, సూర్యపవన్ రెడ్డి, పున్న కైలాస్ నేత నాగర్ కర్నూల్ మల్లు రవి, మందా జగన్నాథం, వెంకటేష్, సంపత్, పెద్దపల్లి నుండి  గడ్డం వంశీ, ఎ. చంద్రశేఖర్, పెరికి శ్యాం సహాలు పలువురు ధరఖాస్తు చేసుకున్నారు. 

మెదక్ నుండి ఎం.భవానీ రెడ్డి, బండారు శ్రీకాంత్, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, చేవేళ్ల నుండి భీంభరత్, చిగురింత పారిజాత, మల్ రెడ్డి రాంరెడ్డి,  కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి, బండ్ల గణేష్, హరివర్ధన్ రెడ్డి, సర్వే సత్యనారాయణ అప్లికేషన్లు సమర్పించారు.

also read:లక్నో జైలులో 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్: జైళ్ల శాఖ అప్రమత్తం

నిజామాబాద్ నుండి జీవన్ రెడ్డి ఇరవత్రి అనిల్ కుమార్,కరీంనగర్ నుండి ప్రవీణ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, మృత్యుంజయం, సంతోష్, వరంగల్ నుండి సిరిసిల్ల రాజయ్య ఖమ్మం నుండి  మల్లు నందిని, రేణుకా చౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి, వీహనుమంతరావులు ధరఖాస్తు చేసుకున్నారు.మహబూబ్ నగర్ నుండి చల్లా వంశీచంద్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డి, ఆదిలాబాద్ నుండి  నరేష్ యాదవ్, మహబూబాబాద్ నుండి బలరాం నాయక్, రాంనాయక్ లు ధరఖాస్తు చేసుకున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios