Asianet News TeluguAsianet News Telugu

అబ్దుల్ కలాంపై సోషల్ మీడియాలో కొంటె పోస్టు

  • అబ్దుల్ కలాంపై ఆకతాయిల కొంటె పోస్టులు
  • సోషల్ మీడియాలో వైరల్ 
  • తెలియకుండానే షేర్ చేస్తున్న కలాం అభిమానులు
  • మహానుభావులపై ఇలాంటి పోస్టులు సరికాదంటున్న జనాలు
kalam as paper boy  too falls victim to the social media prank

అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు ఉంది కొందరి పరిస్థితి. పిచ్చి పిచ్చి ఫొటోలను మార్పింగ్ చేసి గొప్ప వ్యక్తుల ఫొటోలుగా ప్రచారం చేస్తున్నారు కొందరు కొంటెవాళ్లు. ఇటీవల మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం తాలూకు అరుదైన ఫొటో (రేర్ పిక్చర్) అంటూ ఒకటి సోషల్ మీడియోల చక్కర్లు కొడుతుంది. 

నిజంగా అది అబ్దుల్ కలాం ఫొటో అయితే అందరూ సంతోషించేవారే. కానీ ఇటీవలికాలంలో ఒక బాలుడు పేపర్ వేస్తున్న ఫొటోను తీసుకుని ఇదే అబ్దుల్ కలాం చిన్నప్పటి రేర్ ఫొటో అంటూ పోస్టు చేసేశారు కొందరుకొంటె వాళ్లు . నిరాడంబరమైన అబ్దుల్ కలాం అంటే అభిమానం ఉండనివారు లేరు. భారతీయుందరూ ఆయనను అభిమానించేవాళ్లే. భారత జాతి గర్వించదగ్గ బిడ్డ అబ్దుల్ కలాం కాబట్టి. ఈ అరుదైన ఫొటో అనేసరికే వెంట వెంటనే అభిమానులంతా షేర్స్ చేస్తూ తమ అభిమానం చాటుకుంటున్నారు.

మరి ఆ ఫొటో అబ్దుల్ కలాందే కాదనడానికి వంద అంశాలున్నాయి. 1931లో కలాం జన్మించారు. అంటే ఆ కాలంలో సైకిళ్లు ఉన్నాయా? అన్నది ఒక అనుమానం.

కలాం తొక్కే సైకిల్ ఇటీవలి కాలంలోని మోడ్రన్ సైకిల్. దాని టైర్ చాలా బలిష్టంగా ఉంది. అంటే కలాం పదేళ్ల వయసులో సైకిల్ తొక్కినట్లు అనుకున్నా 80 ఏళ్ల క్రితమే ఇంతటి మోడ్రన్ సైకిళ్లు ఉన్నాయా అన్నది మరో అనుమానం.

ఫొటోలో సైకిల్ వెనకాల ఒక స్తంభం ఉంది. ఆ స్థంభానికి విద్యుత్ తీగలు కూడా ఉన్నాయి. అంటే 80 ఏళ్ల క్రితమే ఇంతటి మోడ్రన్ స్థంభాలు వినియోగించారా? విద్యుత్ తీగలు వాడుకలో ఉన్నాయా? ఇది ఇంకో అనుమానం.

ఇంకోటేమంటే సుమారు 80 ఏళ్ల క్రితం పత్రికలను సైకిళ్ల మీద సప్లై జరిగిందా? అసలు అన్ని పేపర్లు ముద్రణ జరిగిందా? ఇది కూడా అనుమానమే. ఆరోజుల్లో పత్రికలు పోస్టులో వచ్చేవి.

సైకిల్ వెనకాల సిమెంట్ రోడ్డు ఉంది. అప్పట్లోనే సిమెంట్ రోడ్లు వేశారా? అసలు 80 ఏళ్ల క్రితం ఫొటోగ్రఫీ అంతగా అభివృద్ధి చెందిందా అన్నది మరింత అనుమానమే.

వెనకాల ఇద్దరు మహిళలు అటుగా వెళ్తున్నారు. ఆ మహిళ ధరించిన చీర రంగు రంగుల్లో ఉంది. 80 ఏళ్ల క్రితమే ఇలాంటి మోడ్రన్ రంగు రంగుల చీరెలు వినియోగంలో ఉన్నాయా?

ఇదేకాకుండా ఫొటోలో వెనుక భాగంలో ప్లాస్టిక్ కుర్చీలు, చాట్ బండార్ నడిపే నాలుగు చక్రాల బండి కూడా దర్శనమిస్తున్నాయి.

ఈ దశాబ్దం ఫొటోను బ్లాక్ అండ్ వైట్ లోకి మార్చి ఇదే అబ్దుల్ కలాం చిన్నప్పటి చిత్రం అని ప్రచారం చేయడం బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన మహానుభావుడు. ఆయన గురించి వాస్తవాలు చెప్పాలి కానీ ఇలాంచి చిలిపి పనులు చేయడం సరికాదని సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులను చూసి జనాలు అంటున్నమాట.

Follow Us:
Download App:
  • android
  • ios