Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ వస్తే ఏమొచ్చిందో పూసగుచ్చినట్లు చెప్పిన కడియం

  • గతంలో విద్యారంగంపై తీవ్ర నిర్లక్ష్యం
  • ఇప్పుడు విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
  • 10 జిల్లాలు 31 జిల్లాలుగా అయినాయి
  • కాంట్రాక్టు లెక్చరర్ల క్రమబద్ధీకరణను కాంగ్రెస్ అడ్డుకుంది
  • కేసిఆర్ కచ్చితంగా రెగ్యలరైజ్ చేసి తీరుతారు
  • కాలేజీల్లో సిసి కెమరాలు, అదనపు గదులు నిర్మించాం
Kadiam narration on benefits after telangana formation in his own way

తెలంగాణ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండమైన పాలన జరుగుతోంది.  తెలంగాణ వస్తే ఎమోస్తది అని ప్రశ్నించిన వాళ్ళకి సమాధానం 9.90 కోట్ల రూపాయలతో సకల సదుపాయాలతో నిర్మించిన ఈ నాలుగు కాలేజి భవనాలు. తెలంగాణ వస్తే 10 జిల్లాలు 31జిల్లాలు అయ్యాయి. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చొరవ వల్ల నిర్మల్ కూడా జిల్లాగా అయ్యింది. నిర్మల్ లో మైనారిటీలు అధికంగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ విద్యకు ప్రాధాన్యత ఇస్తోంది. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ దక్షత వల్ల నేడు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. గతంలో ఫిబ్రవరి వచ్చిందంటే యాసంగి పంటకు కరెంట్ కోతలు ఆపాలని, ఎరువులు, విత్తనాలు లేవని రైతులు ధర్నాలు చేసేవాళ్ళు. కానీ సీఎం కేసీఆర్ పనితీరు వల్ల నేడు ఇలాంటివేవి లేవు. ఇపుడు ప్రయోగాత్మకంగా మెదక్, కరీంనగర్, నల్గొండ జిల్లాలో చేపట్టిన 24 గంటల కరెంటు సరఫరా వల్ల రైతులు మాకు 24 గంటల విద్యుత్ వద్దనే పరిస్థితి వచ్చింది.

గతంలో విద్యను నిర్లక్ష్యం చేశారు. కాలేజీలు మంజూరు చేసి..నిధులు, నియామకాలు, భవనాలు ఇవ్వడం మరిచారు. కానీ నేను ఈ రోజు గర్వంగా చెబుతున్నా గడిచిన 3 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ వల్ల నేడు 404 జూనియర్ కాలేజీలుంటే 391 కాలేజీలకు పక్క భవనాలు ఏర్పాటు చేసుకున్నాం. 13 కాలేజీలకు స్థలం లేక భవనాలు నిర్మించలేదు. త్వరలో స్థలం సేకరించి భవనాలు నిర్మిస్తున్నాం. ఈ 3 ఏళ్లలో కాలేజీలలో అదనపు గదులు,  సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్, లాబ్ పరికరాలు, గేమ్స్, కంప్యూటర్ల కోసం 325 కోట్ల రూపాయలు ఖర్చు చేసాం.

కాంట్రాక్టు లెక్చరర్లను క్రమబద్ధీకరణ చెయ్యడానికి కాబినెట్ మొదటి సమావేశంలో నిర్ణయం తీసుకుని జీ ఓ 16 జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. అయితే కాంగ్రెస్ అధికార ప్రతినిధి, కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం నేతలు కలిసి కోర్టుల్లో కేసు వేసి అడ్డుకున్నారు. దీనివల్ల మా కాంట్రాక్టు లెక్చరర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ సీఎం కేసీఆర్ కచ్చితంగా వీరిని రెగ్యులరైజ్ చేస్తారు. అంతవరకు వీరి వేతనాలను భారీగా పెంచారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ కాలేజీల్లో 60 వేల మంది విద్యార్థుల నమోదు పెరిగింది. నిర్మల్ లో గతంలో 300 మంది విద్యార్థులుంటే ఇప్పుడు 714 మంది విద్యార్థులున్నారు. జన్నారంలో 300 నుంచి 500 వరకు పెరిగారు.

ఈ మూడేళ్ళలో పాలిటెక్నిక్ కాలేజీలకు 320 కోట్లు, డిగ్రీ కాలేజీల కోసం 160 కోట్లు, విశ్వ విద్యాలయాల కోసం 420 కోట్లు సీఎం కేసీఆర్ ఇచ్చారు.  ఎన్నడూ లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తోంది.  బంగారు తెలంగాణ కావాలంటే మానవ వనరుల అభివృద్ధి జరగాలని భావించిన సీఎం కేసీఆర్ తెలంగాణ లో ఉచిత విద్య మాత్రమే కాకుండా నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో కేజీ టు పీజీ విద్య అమలు చేస్తున్నారు. అంబేద్కర్ 125వ జయంతి సంధర్బంగా దళిత, పేద వర్గాలకు ఇంకా ఏం చేస్తే బాగుంటుందని సీఎం కేసీఆర్ నన్ను అడిగినప్పుడు..ఈ వర్గాలకు నాణ్యమైన విద్య అందాలంటే మరో 125 గురుకులాలు ఇవ్వాలని అడిగితే..పెద్ద మనసుతో ఆయన 525 గురుకులాలు ఇచ్చిన మనసున్న మారాజు మన కేసీఆర్.

తెలంగాణ రాకముందు రాష్ట్రంలో 315 గురుకులాలు ఉంటే ఇప్పుడు 840 గురుకులాలున్నాయి. దేశంలో ఎక్కడా ఇన్ని గురుకులాలు లేవు. తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేయాలని, రైతును రాజు చెయ్యాలని సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారు.  రైతులకు 17 వేల కోట్ల రూపాయల పంట రుణాలు మాఫీ చేశారు. ఎకరానికి 8వేల రూపాయలను పెట్టుబడిగా ఇస్తున్నారు. ఈ నెల 31 నుంచి రెవెన్యూ రికార్డులను సరి చేసే కార్యక్రమం ప్రారంభం కానుంది. రైతు అకౌంట్ కె ఈ డబ్బులు చేరాలని రైతు సమన్వయ సమితిలు ఏర్పాటు సెప్టెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు ఏర్పాటు చేసే కార్యక్రమం జరగనుంది. వీటిద్వారా రేపు రైతులే తమ పంట ధరను నిర్ణయించుకోబోతున్నారు.

43 వేల కోట్ల రూపాయల తో మిషన్ భగీరథ ద్వారా ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి తాగునీటిని జనవరి1, 2018 న కానుకగా ఇవ్వనున్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. షాది ముబారక్, కల్యాణ లక్ష్మి ద్వారా ఆడపిల్ల పెళ్లి కోసం 75,116 రూపాయలు, ఆసరా పెన్షన్ల ద్వారా 38 లక్షల మందికి ఏటా 5300 కోట్ల రూపాయలు, పేద గర్భిణి స్త్రీల కోసం ప్రసవానికి ముందు, తర్వాత 14 వేల రూపాయలు కేసీఆర్ కిట్ పేరుతో అందిస్తున్నాం.  నేడు కోటి ఎకరాలకు నీరు అందించే విధంగా ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. ఇందులో నియోజక వర్గానికి లక్ష ఎకరాలకు నీరందించే కార్యక్రమం జరుగుతోంది. ఇన్ని అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో తెలంగాణలో తప్ప మరెక్కడ జరగడం లేదు.  

మంచిర్యాల జిల్లా, జన్నారంలో 2.25 కోట్లతో, కాసిపేటలో 2.25 కోట్ల రూపాయల తో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి శ్రీ కడియం శ్రీహరి, గృహ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎంపీ బాల్క సుమన్, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యేలు రేఖానాయక్, దుర్గం చిన్నయ్య, కలెక్టర్లు, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.

 

మరిన్ని తాజా తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Follow Us:
Download App:
  • android
  • ios