కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఎంఎంటీస్ లోకోపైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్ధితి విషమంగా ఉంది. ఈ మేరకు నాంపల్లిలోని కేర్ ఆసుపత్రి వర్గాలు చంద్రశేఖర్ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.

ఆయన రెండు కాళ్లకు రక్తప్రసరణ తగ్గిపోయిందని.. ప్రమాదంలో పక్కటెముకలు, మూత్రపిండాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు వెల్లడించారు. చంద్రశేఖర్‌తో పాటు ఈ ప్రమాదంలో గాయపడిన మహ్మద్ ఇబ్రహీం, రాజ్ కుమార్, సాజిద్, బాలేశ్వరమ్మల పరిస్ధితి నిలకడగా ఉందన్నారు. 

సోమవారం నాడు ఉదయం  కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఆగి ఉన్న ఇంటర్ సిటీ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ ఇంకా రైలులోనే ఇర్రుకొన్నాడు. ఆయనను వెలికితీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read:డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం: రైల్వే ఏజీఎం

ఎంఎంటీఎస్ రైలు డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకొందని రైల్వే ఏజీఎం బి.బి. సింగ్ అభిప్రాయడ్డారు. ఎక్స్ ప్రెస్ రైలును ఢీకొట్టడంతో ఎంఎంటీఎస్ రైలులోని ఆరు బోగీలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన చెప్పారు.లింగంపల్లి పలక్‌నుమా మధ్య రైళ్ల రాకపోకలను నిలిపివేసినట్టుగా రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు.

మరోవైపు కేబిన్‌లో చిక్కుకొన్న ఎంఎంటీఎస్ డ్రైవర్ ను బయటకు తీసేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రయత్నాలు చేస్తున్నట్టుగా రైల్వే అధికారులు తెలిపారు. గ్యాస్ కట్టర్ ద్వారా కేబిన్ ను కత్తిరించేందుకు  సిబ్బంది ప్రయత్నిస్తున్నట్టుగా చెప్పారు.

డ్రైవర్ కేబిన్ లో చిక్కుకొన్న డ్రైవర్ కు ఆక్సిజన్ ను అందిస్తున్నట్టుగా రైల్వే అధికారులు ప్రకటించారు. క్షతగాత్రులను ఉస్మాయా ఆసుపత్రికి తరలించినట్టుగా అధికారులు తెలిపారు.

హైదరాబాద్‌ నగరంలోని కాచిగూడ రైల్వేస్టేషన్ సమీపంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలును ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న ఘటనకు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని రైల్వే ఏజీఎం బి.బి సింగ్  చెప్పారు.

Also Read:mmts train accident: కాచిగూడలో రెండు రైళ్ల ఢీ, 30 మందికి గాయాలు

కాచిగూడ రైలు ప్రమాదం దురదృష్టకరమన్నారు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేశ్. ప్రమాదం అనంతరం ఆయన స్పందిస్తూ.. ఈ ఘటనలో లోకో‌పైలట్‌తో పాటు 12 మందికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. 

క్షతగాత్రులకు ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని.. సిగ్నల్ వ్యవస్థలో ఎలాంటి లోపం లేదని రాకేశ్ స్పష్టం చేశారు. ఒకే సమయంలో రెండు రైళ్లను ఒకే ట్రాక్‌పైకి వచ్చేలా సిగ్నల్ ఇవ్వలేదని.. ఎంఎంటీస్ లోకో పైలట్ సిగ్నల్ ఇవ్వకుండానే రైలు ఎందుకు ముందుకు తీసుకెళ్లాడో దర్యాప్తులో తెలుస్తుందని రాకేశ్ అభిప్రాయపడ్డారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ జరుగుతుందని.. స్టేషన్‌లో ఫ్లాట్‌ఫామ్ సమస్య లేదని సీపీఆర్వో వెల్లడించారు.