Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల్లో గెలిపించండి.. సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని స్వర్గం చేస్తాను: కేఏ పాల్

బీఆర్ఎస్ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదని.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో వస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు.

KA Paul says if we win will make secunderabad as heaven ksm
Author
First Published Oct 16, 2023, 4:38 PM IST | Last Updated Oct 16, 2023, 4:38 PM IST

బీఆర్ఎస్ ఇచ్చిన ఏ హామీలను నెరవేర్చలేదని.. ఇప్పుడు కొత్త మేనిఫెస్టోతో వస్తుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. కేఏ పాల్ సోమవారం రోజున తుకారం గేట్‌లోని మాంగర్ బస్తీలో పాల్ పర్యటించారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని కోరారు. ప్రజాశాంతి పార్టీ తరఫున బరిలో ఉండాలని కోరుకుంటున్న వారు పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. రేవంత్ రెడ్డికి ఇచ్చినట్లుగా రూ.10 కోట్లు, రూ.50 కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, రూ.10 వేలు మాత్రమే గూగుల్ పే లేదా ఫోన్ పే చేసి, రెజ్యుమ్ పెట్టాలన్నారు. అప్పుడు తమ కోర్ కమిటీ వచ్చి వారిని కలుస్తుందని చెప్పారు. ఎన్నికలు మరెంతో దూరంలో లేనందున ఆలస్యం చేయవద్దని కోరారు. 

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పద్మారావు ఇచ్చిన వాగ్దానం ఒక్కటి కూడా నెరవేర్చలేదని అన్నారు. తమను గెలిపిస్తే విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకువచ్చి సికింద్రాబాద్‌ను స్వర్గంగా మారుస్తానని.. 200 దేశాల్లోని వారు ఇక్కడకు వచ్చి చూసేలా చేస్తానని చెప్పారు. బంగారు తెలంగాణ చేస్తానన్న సీఎం కేసీఆర్ మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో అర్హలైన అందరికీ ప్రభుత్వ పథకాలను అమలు చేయలేని ప్రభుత్వం.. మళ్లి ఇప్పుడు మేనిఫెస్టో విడుదల చేసి అన్ని ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. పెన్షన్ డబుల్ చేస్తామని చెబుతున్నారని.. ఇప్పటివరకు ఎందుకు ఆ పని చేయలేదని ప్రశ్నించారు. తన మేనిఫెస్టోను కాపీ కొట్టినట్లు పబ్లిక్ టాక్ ఉందన్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తనకు మద్దతుగా ఉండాలని కోరారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రజాశాంతి పార్టీ తరపున పోటీ చేస్తానని ప్రజలు తనని ఆశీర్వదించాలని కోరారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios