మరో 48 గంటల పాటు క్రిటికల్ కేర్ యూనిట్ అబ్జర్వేషన్ లో కొత్త ప్రభాకర్ రెడ్డి..
Hyderabad: కత్తిపోట్లతో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ ఎంపీ కే ప్రభాకర్ రెడ్డిని శస్త్రచికిత్స ద్వారా క్రిటికల్ కేర్ యూనిట్ కు తరలించారు. ప్రభాకర్‌రెడ్డిని క్రిటికల్ కేర్ యూనిట్‌లో 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని యశోద వైద్యులు తెలిపారు.
Telangana Assembly Elections 2023: కత్తిపోట్లతో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ ఎంపీ కే ప్రభాకర్ రెడ్డిని శస్త్రచికిత్స ద్వారా క్రిటికల్ కేర్ యూనిట్ కు తరలించారు. ప్రభాకర్‌రెడ్డిని క్రిటికల్ కేర్ యూనిట్‌లో 48 గంటల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతామని యశోద వైద్యులు తెలిపారు.
వివరాల్లోకెళ్తే.. అధికార పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకుడిపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. కత్తిపోటుతో గాయపడి యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్‌ఎస్ ఎంపీ కే ప్రభాకర్ రెడ్డిని సర్జికల్ క్రిటికల్ కేర్ యూనిట్‌కు తరలించి, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు, ఇంటెన్సివిస్ట్ తదితరులతో కూడిన మల్టీడిసిప్లినరీ టీమ్ పర్యవేక్షిస్తోంది. బీఆర్ఎస్ నాయకుడిని తదుపరి 48 గంటల పాటు క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచనున్నట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. హాస్పిటల్ విడుదల చేసిన మెడికల్ బులెటిన్ ప్రకారం.. ప్రభాకర్ రెడ్డి బ్రాడ్-స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్, ఐవీ ఫ్లూయిడ్స్, నొప్పి మందులు, ఇతర మెడికల్ సహాయక చర్యలపై ఉన్నారు. అయితే, ఆయన స్పృహలో ఉన్నారనీ, పెద్ద శస్త్రచికిత్స నుండి కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ప్రభాకర్‌రెడ్డిని మరో 24-48 గంటల పాటు క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచాల్సి ఉందనీ, ఆ తర్వాత ఆయనను రూమ్‌కి తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు.
రేపటి వరకు సర్జికల్ టీమ్ సలహా మేరకు ప్రభాకర్ రెడ్డి కూడా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండనున్నారు. రేపటి వరకు నీరు త్రాగడం మినహా ఇతర పదర్థాలను తీసుకోవడంపై మళ్లీ అంచనా వేయబడుతుంది. నోటి ఆహారంలో ద్రవాన్ని క్రమంగా అందించడం జరుగుతుందనీ, ఆయన సాధారణ ల్యాబ్‌లతో హెమోడైనమిక్‌గా స్థిరంగా ఉన్నారు. ఆయనకు కత్తిపోటు గురైనా శరీర భాగంలో మాత్రమే నొప్పి కలిగివుండగా, ప్రస్తుతం జ్వరం కూడా లేదనీ, గాయం దగ్గర తప్ప ఇతర ప్రాంతాల్లో ఎలాంటి నొప్పి లేదన్నారు. ఇదిలావుండగా, విపక్షాలు అల్లర్లు సృష్టించి, వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు ఆరోపించారు. దాడికి గురై యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిని మంగళవారం పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ అధినేతపై దాడిని విపక్షాలు అపహాస్యం చేస్తున్నాయని హరీశ్ రావు దుయ్యబట్టారు. సీనియర్ నేతలు సైతం చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఎన్నికలలో ఎన్నుకోబడటానికి బీఆర్ఎస్ కు అలాంటి పద్ధతులు అవసరం లేదన్నారు. 15 సెంటీమీటర్లు కోసి చిన్నపేగులో కొంత భాగాన్ని తొలగించామని వైద్యులు చెబుతుంటే.. విపక్ష నేతలు చౌకబారు వ్యాఖ్యలు చేయడం వారి రాజకీయ దివాళాకోరుతనాన్ని తెలియజేస్తోందని హరీశ్ రావు అన్నారు.
ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నట్టు మంత్రి తెలిపారు. వారి కాల్ వివరాలను సేకరించారనీ, నిజాన్ని బయటకు తీసుకురావాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. రెండు రోజుల్లో కేసును ఛేదిస్తామని ఆశిస్తున్నామని హరీశ్ రావు తెలిపారు. ఇలాంటి హత్యా రాజకీయాలను తెలంగాణ గతంలో చూడలేదన్నారు. ఈ తరహా హత్యా రాజకీయాలు రాయలసీమ, బీహార్‌లో కనిపించాయి. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి దాడులు జరగలేదన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు ఎవరిపైనా పగ లేదని అన్నారు. ఆయనకు పగ ఉంటే చాలా మంది జైలులో ఉండేవారు. కాంగ్రెస్ నేతలు కోట్లాది రూపాయలను మింగేస్తూ హౌసింగ్ స్కామ్‌లకు పాల్పడ్డారని.. వారిని జైలుకు పంపేవారమని, ఓటుకు నగదు కేసు ఉంది కానీ మేమేమీ చేయలేదని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగాలనీ, న్యాయవ్యవస్థపై పార్టీకి విశ్వాసం ఉందన్నారు.