హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద గ్యాంగ్ రేప్  గురై, హత్య చేయబడిన దిశ హత్య కేసులో నిందితులను గుర్తించడంలో మహాబూబ్‌నగర్ కు చెందిన రవాణాశాఖాధికారుల సాక్ష్యం కీలకం కానుంది. ఈ ఘటనకు సంబంధించిన కీలక ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు.

Also read:justice for Disha:జైలులో ఆ నలుగురిపై నిఘా

దిశపై గ్యాంగ్ రేప్, హత్య కేసులో కీలక నిందితుడు మహ్మద్ ఆరిఫ్ లారీని హత్యకు ముందు రోజు మహాబూబ్‌నగర్ లో రవాణాశాఖాధికారులు పట్టుకొన్నారు. దీంతో రవాణాశాఖాధికారుల సాక్ష్యం కూడ ఈ కేసులో కీలకం కానుంది.

Also readJustice for Disha: పోలీస్ కస్టడీకి దిశ హత్య కేసు నిందితులు

 మహ్మద్‌ ఆరిఫ్‌ తాను నడిపే లారీని హత్యోదంతానికి ముందు రోజు మహబూబ్‌ నగర్‌ మీదుగా హైద్రాబాద్‌కు వస్తుండగా రవాణాశాఖ విజి లెన్స్‌ బృందం ఆ లారీని నిలిపి తనిఖీలు చేసింది. ఆ సమయంలో లారీలో ఉన్న ఆరీఫ్‌, అతడికి క్లీనర్‌గా ఉన్న మరొకరిని రవాణా సిబ్బంది చూశారు.
 
ఓవర్‌ లోడ్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడాన్ని గుర్తించి ఫైన్‌ రాసి, ఆ మొత్తం కట్టాలని సూచించారు. అయితే ఈ విషయాన్ని ఆ సమయంలో ఆరీఫ్ లారీ యజమానికి చెప్పాడు. లారీని రవాణశాఖాధికారుల చేతికి వెళ్లకుండా చూడాలని ఆరిఫ్ కు లారీ యజమాని సూచించాడు.

ఈ సమయంలో ఆరిఫ్ లారీ స్టార్ట్ కాకుండా ఇగ్నిషన్ బటన్ వద్ద వైర్ ను తీసేశాడు. ఈ సమయంలో లారీ ఎంతకు స్టార్ట్ కాకపోవడంతో రవాణాశాఖాధికారులు లారీని అక్కడే వదిలి వెళ్లిపోయారని షాద్‌నగర్ పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

అక్కడి నుండి లారీని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వద్దకు తీసుకొచ్చారు. అక్కడే రోజంతా లారీని నిలిపి ఉంచారు. అయితే నిబంధనలకు విరుద్దంగా లారీని వదిలేశారని రవాణాశాఖాధికారులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మరో వైపు తాము నిబంధనల మేరకే వ్యవహరించామని రవాణాశాఖాధికారులు చెబుతున్నారు.

 జరిమానా, లారీ వివరాలు నమోదు చేసి డ్రైవర్‌ వివరాలు లాక్‌ చేశామని రవాణాశాఖాధికారులు స్పష్టం చేస్తున్నారు. లారీని సీజ్‌ చేసే అధికారం తమకు లేకపోవడంతో పోలీస్‌స్టేషన్‌కు అప్పగించేందుకు ప్రయత్నిస్తే వారి సహకారం అందలేదని చెబుతున్నారు.

దాంతో లారీ డ్రైవర్‌ ఫోన్లు, లారీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకొని లారీని వదిలేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈ కేసు విషయంలో తమను ఎవరూ సంప్రదించ లేదని, పోలీస్‌శాఖ నుంచి వివరాలడిగితే నిబంధనల మేరకు నడుచుకుంటామన్నారు.