Asianet News TeluguAsianet News Telugu

Justice for Disha: పోలీస్ కస్టడీకి దిశ హత్య కేసు నిందితులు


పోలీసుల విజ్ఞప్తి విన్న షాద్ నగర్ కోర్టు వారం రోజులపాటు రిమాండ్ కు అనుమతి ఇచ్చింది. దాంతో గురువారం ఉదయం 10 గంటలకు నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. గురువారం నుంచి ఈనెల 11 వరకు పోలీసులు నిందితులను విచారించనున్నారు. 

Justice for Disha: Shadnagar court green signal for disha accuses for police custody
Author
Hyderabad, First Published Dec 4, 2019, 6:22 PM IST

హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ వైద్యురాలు దిశ హత్య కేసు నిందితుల రిమాండ్ కు షాద్ నగర్ కోర్టు అనుమతి ఇచ్చింది. వారం రోజులపాటు నిందితులను పోలీస్ కస్టడీకి ఇస్తూ షాద్ నగర్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

ప్రస్తుతం నలుగురు నిందితులు మహ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు చర్లపల్లి జైల్లో రిమాండ్ లో ఉన్నారు. కేసులో మరిన్ని ఆధారాలు సేకరించాల్సిన నేపథ్యంలో వారం రోజులపాటు కస్టడీకి కోరారు షాద్ నగర్ పోలీసులు. 

అయితే నిందితుల తరపున వాదించేందుకు న్యాయవాదులు సహాయనిరాకరణ చేయడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది షాద్ నగర్ కోర్టు. శాంతి భద్రతలు దృష్ట్యా నిందితులను బయటకు తీసుకువచ్చే పరిస్థితి లేకపోవడంతో నిందితులను జైల్లో నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది కోర్టు. 

Justice For Disha:మహాబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు

పోలీసుల విజ్ఞప్తి విన్న షాద్ నగర్ కోర్టు వారం రోజులపాటు రిమాండ్ కు అనుమతి ఇచ్చింది. దాంతో గురువారం ఉదయం 10 గంటలకు నిందితులను పోలీసులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. గురువారం నుంచి ఈనెల 11 వరకు పోలీసులు నిందితులను విచారించనున్నారు. 

నిందితులను కస్టడీలో తీసుకున్న తర్వాత హత్యకు సంబంధించి సీన్ రీ కనస్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. అలాగే లారీలో దొరికిన దిశ హెయిర్, లోదుస్తులు, బ్లడ్ శాంపిల్స్ తోపాటు మరిన్ని ఇతర ఆధారాలను సేకరించాల్సి ఉంది. 

justice for Disha:'వాళ్లను ఉరి తీసే రోజు కోసం చూస్తున్నా'

దేశవ్యాప్తంగా కలకలం రేపిన దిశ హత్యకేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. దిశ కేసును త్వరితగతిన విచారణ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు కోసం హైకోర్టును అనుమతి కోరింది. 

ప్రభుత్వ అభ్యర్థనను పరిశీలించిన రాష్ట్ర హైకోర్టు ధర్మాసనం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. మహబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

ఇకపోతే కామాంధుల చేతులో అత్యంత దారుణ హత్యకు గురైన దిశ కేసులో నిందితులను ఉరితీయాలని దేశ వ్యాప్తంగా ప్రజలంతా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. దేశ్యాప్తంగా నిరసనలతో హోరెత్తిస్తున్నారు.  

Justice for Disha: Shadnagar court green signal for disha accuses for police custody

Follow Us:
Download App:
  • android
  • ios