justice for Disha:జైలులో ఆ నలుగురిపై నిఘా

చర్లపల్లి జైలులో నిందితులపై అధికారులు ఓ కన్నేసి ఉంచారు. జైలు వద్ద కూడ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

justice for Disha:Security heightened at jail housing accused

హైదరాబాద్: దిశను హత్య చేసిన నలుగురు నిందితులపై చర్లపల్లి జైలులో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంచారు. నిందితులను మహానది బ్యారక్‌లో ఉంచారు. షాద్‌నగర్ పోలీసులు ఇవాళ నిందితులను తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.

Also read:దిశ కేసులో కీలక మలుపు, నెలరోజుల్లోనే శిక్ష: మహబూబ్ నగర్ లో తొలి ఫాస్ట్ ట్రాక్ కోర్టు

వారం రోజుల క్రితం శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద దిశపై గ్యాంగ్ రేప్ కు పాల్పడి ఆమెను అత్యంత దారుణంగా హత్య చేశారు. నిందితులను పోలీసులు గత నెల 30 వ తేదీన చర్లపల్లి జైలుకు తరలించారు.

Also read:Justice for Disha: పోలీస్ కస్టడీకి దిశ హత్య కేసు నిందితులు

చర్లపల్లి జైలులో నిందితులను మహానది బ్యారక్ లో ఉంచారు. నిందితులపై జైలు శాఖాధికారులు నిఘా ఏర్పాటు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ జైలు ముందు ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో చర్లపల్లి జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. 

 Also read:Justice For Disha:మహాబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు

జైలులో ఉన్న నిందితుల మానసిక పరిస్థితిపై జైలు అధికారులు ఓ కన్నేసి ఉంచారు. ఏ సమయంలో నిందితులు ఎలా ప్రవర్తిస్తున్నారు, తోటి ఖైదీలతో ఎలా ఉంటున్నారనే విషయమై కూడ ఆరా తీస్తున్నారు.

ఈ నిందితుల వద్ద కాపలాగా ముగ్గురు కానిస్టేబుళ్లను ఏర్పాటు చేశారు. మరో వైపు జైలులో ఇతర నిందితులతో ఈ నలుగురు అంతగా కలిసి పోవడం లేదని తెలుస్తోంది. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా సంచలనం కావడంతో జైలు అధికారులు కూడ నిందితుల రక్షణకు పటిష్టమైన భద్రత చర్యలు తీసుకొన్నారు. చర్లపల్లి జైలు వద్ద కూడ పోలీసులు భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు.

జైలులో చేరిన మరునాడే నిందితులకు మాంసాహరాన్ని అందించారు. ఓ యువతిని అత్యంత దారుణంగా హత్య చేసిన నిందితులకు విందు భోజనాలు పెట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది.

ఈ  కేసులో కీలకమైన ఆధారాల కోసం పోలీసులు నిందితులను తమ కస్టడీలోకి తీసుకోనున్నారు.షాద్‌నగర్ కోర్టు బుధవారం నాడు నిందితులను షాద్‌నగర్ పోలీసుల కస్టడీకి వారం రోజుల పాటు ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఈ ఘటనకు సంబంధించి సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. అయితే ఈ సమయంలో నిందితులను బయటకు తీసుకువస్తే జనాన్ని అదుపు చేయడం సాధ్యమా అనే అనుమానాలు కూడ పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ కోసం పోలీసులు తరలించే అవకాశాలు లేకపోలేదు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios