Justice For Disha:మహాబూబ్‌నగర్‌లో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు

దిశ కేసులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Justice For Disha: High court Appoints Fast Track Court in Mahaboobnagar

హైదరాబాద్: దిశ‌పై గ్యాంగ్‌రేప్, హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకొంది. పాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటైంది.మహాబూబ్‌నగర్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ చేయనుంది.

Also read:జస్టిస్ ఫర్ దిశ: ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టుకు లేఖ

మహాబూబ్‌నగర్ జిల్లా కోర్టులో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు స్పెషల్ బెంచ్‌ను ఏర్పాటు చేయనున్నారు.ప్రస్తుతం మహాబూబ్ నగర్ లో కోర్టు ఏర్పాటు చేసినట్టుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోసం స్పెషల్ బెంచీ ఏర్పాటు కోసం హైకోర్టు త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. 

Also read జస్టిస్ ఫర్ దిశ: ప్రగతి భవన్ ముట్టడికి యత్నించిన తృప్తి దేశాయ్ అరెస్ట్

షాద్‌నగర్ కోర్టు నుండే ఈ కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు బదిలీ చేయనున్నారు. ఈ కోర్టులోనే పోలీసులు చార్జీషీట్ దాఖలు చేయనున్నారు.దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ గ్యాంగ్‌రేప్, హత్య కేసును వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు వీలుగా పాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ పంపింది.

Also read:15 రోజుల క్రితమే అమ్మమ్మ: దిశ ఫ్యామిలీపై దెబ్బ మీద దెబ్బ

దిశ హత్య కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు బుధవారం నాడు లేఖ పంపింది.ఈ లేఖకు హైకోర్టు సమాధానాన్ని ఇచ్చింది. వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని శంషాబాద్ సమీపంలోని తొండుపల్లి ఔటర్ రింగ్ రోడ్డు వద్ద దిశపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడి హత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన దేశంలో సంచలనం రేపుతోంది.

Also read:Justice For Disha: ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఈ ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.ఈ తరుణంలో ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం కూడ భావిస్తోంది. ఈ తరుణంలోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు లేఖ రాసింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున తెలంగాణ న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి హైకోర్టుకు లేఖ రాశారు.ఈ లేఖకు హైకోర్టుకు సానుకూలంగా స్పందించింది. ఫాస్ట్ ట్రాక్  కోర్టు ఏర్పాటుకు సానుకూలంగా హైకోర్టు లేఖ రాసింది.  ఈ లేఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ న్యాయ శాఖకు అందింది.

ఈ విషయమై తెలంగాణ న్యాయ శాఖ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు విషయమై రంగం సిద్దం చేసింది. మరో వైపు ఈ కేసులో నిందితులను  కఠినంగా శిక్షించాలనే అభిప్రాయంతో తెలంగాణ ప్రభుత్వం కూడ ఉంది. ఇటీవల కాలంలోనే వరంగల్ లో రేప్ నిందితుడికి  కూడ ఆరు మాసాల్లోనే  శిక్ష పడింది. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ కేసు విచారణ చేసి నిందితుడికి శిక్షను విధించింది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios